భూలోకంలో యమ లోకం(‘సినిమాకెళ్దాం రండి’ప్రివ్యూ )
కథ ప్రకారం ...ప్రసాద్ (రాజేంద్రప్రసాద్), భరత్ (మాస్టర్ భరత్) ఇద్దరూ అన్నదమ్ములు. చిన్నతనంలో అందరికీ దూరమై అనాథలవుతారు. వీళ్లని ఓ పెద్ద మనిషి చేరదీస్తాడు. అతనికి ఓ గారాల కూతురు ఉంటుంది. ఆమెను తమ సొంత సోదరిగా భావిస్తారు ఈ ఇద్దరూ. ఈ కుటుంబానికి తీరని అన్యాయం చేస్తాడు స్థానిక ఎమ్మెల్యే (నాగినీడు). ఇతనికి అతని తమ్ముడు రాంబాబు (రవిబాబు) తోడవుతాడు. ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయడానికి కొంతమంది మిత్రులతో కలిసి ప్రసాద్, భరత్‌లు ఏమి చేశారనేది మిగిలిన కథ.
దర్శకుడు మాట్లాడుతూ ''ఆద్యంతం మలుపులతో సాగే బలమైన కథాంశమిది. రాజేంద్రప్రసాద్, భరత్‌లు చేసే సందడి కడుపుబ్బ నవ్విస్తుంది. యమలోకపు సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి'' అన్నారు. నిర్మాత మాట్లాడుతూ-''వెరెైటీ సినిమా తీయాలనే ప్రయత్నంతోనే ఈ సినిమా చేశాం. చక్కని వినోదంతో పాటు నవరసాలు పండాయి. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ పాత్ర వెరెైటీగా, తమాషాగా ఉంటుంది. 6 విభిన్న వేషాల్లో ఆయన కనిపిస్తారు. యముడిగా, బ్రాహ్మ ణుడిగా..అతడి నటన హైలెైట్. దర్శకుడు రవిబాబు, నాగినీడు కీలకపాత్రలలో కనిపి స్తారు. చివరి అర్థగంట ఎం.ఎస్. నారాయణ కడుపుబ్బా నవ్విస్తారు. నాలుగు ఐటమ్ పాటలలో రచనమౌర్య ఐటం, ఆషా శెైని స్పెషల్ సాంగ్ హైలెైట్'' అన్నారు.
సంస్థ: శ్రీ ప్రొడక్షన్స్
నటీనటులు: రాజేంద్రప్రసాద్, మాస్టర్ భరత్, నాగినీడు, రవిబాబు, ఎమ్మెస్ నారాయణ, రాజీవ్ కనకాల, ఆశాశైనీ, రచనా మౌర్య, అజయ్, సోనా, నాగినీడు, మురళి, వీనా సిద్ధు, శ్రీమాన్, బ్రహ్మానందం, తాగుబోతు రమేష్ తదితరులు.
కెమెరా: అంజి,
సంగీతం: శ్రవణ్,
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్,
కళ: నారాయణరెడ్డి,
మాటలు: వి.వి.దుర్గాప్రసాద్,
కథా సహకారం: బేగ్,
కథ-కథనం-దర్శకత్వం:యం.యం.జి.రెడ్డి.
నిర్మాతలు: సునీత ప్రభాకర్, సీత నెక్కంటి
విడుదల: శుక్రవారం.


Click it and Unblock the Notifications












