విడుదలకు సిద్దమైన రాజేంద్రుడి ‘డ్రీమ్’
రాజేంద్రప్రసాద్ హీరోగా కైపష్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందుతున్న చిత్రం 'డ్రీమ్' ఈ చిత్రం అతి తర్వలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా హీరో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ...ఈ చిత్రంలో నేను పోషించిన పాత్రలని ఎప్పటికీ మరిచిపోలేను, అలాగే సినిమా చూశాక పేక్షకులు మరిచిపోలేరు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదల చేసిన నా రెండు గెటప్స్ కి మంచి స్పందన లభించింది. మరో గెటప్ ని త్వరలో ట్రైలర్ లాంచ్ ఫంక్షన్లో రిలీజ్ చేయనున్నాం. ఈ కారెక్టర్ యూత్ ఫుల్ గా, డిఫరెంట్ షేడ్స్ లో ఉంటుంది. ఇటువంటి కారెక్టర్ చేయడం చాలా ఆనందాన్ని కలిగించింది' అన్నారు.
చిత్ర నిర్మాతలు చిత్రం గురించి వివరిస్తూ..వెరైటీ సినిమాలని కోరుకునే ప్రేక్షకులను త్వరలో రిలీజ్ కాబోతున్న మా డ్రీమ్ చిత్రం చక్కగా అలరిస్తుంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ గారు ఒక గెటప్ నుంచి మరో గెటప్ కి ఎందుకు మారుతారనేది..ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశం. ప్రస్తుతం గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్ తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు. ఈ సినిమాకు కెమెరా : రవి కుమార్, సంగీతం : సంతోష్, ఎడిటర్ : బస్వా పైడి రెడ్డి, ఆర్ట్ : రమణ, నిర్మాణం : కైపస్ ఫిల్మ్ ప్రొడక్షన్, దర్శకత్వం : భవానీ శంకర్


Click it and Unblock the Notifications











