అయ్యారే చిత్రం స్వామి నిత్యానంద స్టోరీ కాదు: రాజేంద్ర ప్రసాద్
అయ్యారే చిత్రం కథ నిత్యానంద స్టోరీ కాదని ప్రముఖ చిత్ర కథా నాయకుడు రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అయ్యారే నిత్యానంద స్టోరీ అని ప్రచారం చేస్తున్నారని అందులో ఎలాంటి నిజం లేదన్నారు. ఓ ఏటిఎం సెంటర్ దగ్గరగా సెక్యూరిటీ గార్డుగా ఉన్న వ్యక్తి స్వామిగా ఎలా మారాడు అని చెప్పామని అన్నారు. స్వామిగా ఎలా ఎదిగాడు, ఎందుకు ఎదిగాడని చెప్పామని అన్నారు.
సినిమా కేవలం నవ్వించడానికి, ప్రజలను చైతన్యపర్చడానికే సినిమా తీశామని చెప్పారు. తనకు ప్రతి సంవత్సరం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ అని అందుకే ఇప్పుడు స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చినట్టు చెప్పారు. అయ్యారే చిత్రాన్ని అందరూ పూర్తిగా ఎంజాయ్ చేస్తారని చెప్పారు. ఆ పాత్ర ప్రేక్షకుల మదిలో ఎప్పుడూ నిలిచి ఉంటుందన్నారు.


Click it and Unblock the Notifications











