»   » సొంత నిర్మాణ సంస్థ స్థాపించిన రాజేంద్రప్రాద్, శివాజీ రాజా

సొంత నిర్మాణ సంస్థ స్థాపించిన రాజేంద్రప్రాద్, శివాజీ రాజా

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటకీరిటి రాజేంద్ర ప్రసాద్ మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత.. ఇచ్చిన మాటను తప్పకుండా పేద కళాకారులకు చేదోడు వాదోడుగా నిలుస్తూ..వారి సంక్షేమమే ధ్యేయంగా కొనసాగుతున్నారు. అలాగే ప్రముఖ నటుడు శివాజీ రాజా 'మా' జనరల్ సెక్రటరీగా కొనసాగుతూ రాజేంద్ర ప్రాసద్ కు మద్ధతుగా నిలుస్తూ వస్తున్నారు. అయితే శివాజీ రాజా-రాజేంద్ర ప్రసాద్ అనుబంధం ఒక్క ‘మా' బంధం మాత్రమే కాదు.. గత 30 ఏళ్ళుగా మంచి మిత్రులుగా వీళ్ల మధ్య సాన్నిహిత్యం ఉంది. అందులో భాగంగానే రాజేంద్ర ప్రసాద్-శివాజీ రాజా కలిసి ఒక కొత్త బ్యానర్ ను స్థాపించబోతున్నారు.

రాజేంద్ర ప్రసాద్-శివాజీ రాజాలు కలిసి టీవి మరియు పిల్మ్ ప్రొడక్షన్స్ ను.. రాజా & రాజా క్రియేషన్స్ (ఆర్&ఆర్ ప్రొడక్షన్స్) పేరిట మొదలు పెట్టబోతున్నారు. అందుకు మే 29 న ముహూర్త కార్యక్రమం జరుపుకుంది. ఈ సందర్భంగా రాజా & రాజా క్రియేషన్స్ గురించి కొన్ని విషయాలను తెలియజేశారు.

Rajendra Prasad and Shivaji Raja's Raja & Raja Creations launched

రాజా అండ్ రాజా క్రియేషన్స్ లో ముఖ్యంగా టీవి కార్య క్రమాలతో పాటు సమాంతరంగా సినిమాలను కూడా నిర్మించబోతున్నాం. త్వరలోనే 'ఈ' టీవిలో ఓ ప్రొగ్రామ్ ను మా బ్యానర్ లో మొదలు పెట్టబోతున్నాం. అలాగే మిగతా అన్ని ఛానల్స్ లోనూ మరిన్ని మంచి ప్రొగ్రామ్స్ అందించబోతున్నాం. రాబోయే కాలంలో మా బ్యానర్ పేరు నిలబెట్టే విధంగా మంచి మంచి టీవి కార్యక్రమాలతో పాటు సినిమాలను నిర్మించడమే మా ధ్యేయం. మా ఇద్దరి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్నరాజా & రాజా క్రియేషన్స్ విజయ పథంలో సాగాలని.. అందుకు మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాతే గా ఈ కార్యక్రమం జరపాలనుకున్నప్పటికీ..ఈ రోజు (మే 29) బాగుండడంతో ముహూర్తం కార్యక్రమం మాత్రమే జరిపినట్టు తెలియజేశారు. మిగతా విషయాలను మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.

రాజా & రాజా క్రియేషన్స్ కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా రాజేంద్ర ప్రసాద్ తనయుడు బాలాజీ, శివాజీ రాజా అల్లుడు కిరణ్ కుమార్ వర్మ వ్యవహరించనున్నారు. ఈ ముహూర్తపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కైకాల సత్యనారాయణ, నాగి రెడ్డి-చక్రపాణిలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని రాజేంద్ర ప్రసాద్-శివాజీ రాజాలను ఆశీర్వదించారు. అలాగే ప్రముఖ దర్శకుడు ఎస్.వి.క్రిష్ణా రెడ్డితో పాటు మరి కొంత మంది సినీ ప్రముఖులు ఈ ముహూర్త కార్యక్రమానికి విచ్చేసి తమ తమ బెస్ట్ విషెష్ ను అందించారు.

English summary
Rajendra Prasad and Shivaji Raja's own production house "Raja & Raja Creations" launched.
Please Wait while comments are loading...