నాగ శౌర్య వేస్ట్ ఫెల్లో, ఎప్పుడూ తాగి రాలేదు, తప్పుగా రాశారు: రాజేంద్రప్రసాద్
సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నందీని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఓ బేబీ'. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ పతాకాలపై సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మించారు.
సమంతతో పాటు లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్, తేజ, ప్రగతి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జులై 5న ప్రేక్షకల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘అహనా పెళ్లంట' తర్వాత మళ్లీ చేయలేదు
‘అహనా పెళ్లంట' సినిమా తర్వాత మళ్లీ నేను సురేష్ ప్రొడక్షన్లో ఏ సినిమా చేయలేదు. అంతకంటే మంచి సబ్జెక్టు దొరక్క పోవడమే కారణం అయుండొచ్చు. ఇపుడు అంతకంటే మంచి సినిమా, మంచి క్యారెక్టర్ ఓ బేబీ సినిమాలో చేసినట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు.

నాగ శౌర్య వేస్ట్ ఫెల్లో అంటూ సరదా కామెంట్
ఈ సినిమా ఇప్పుడు ఇలా మీ ముందు ఉండటానికి కారణం సమంత, నందినీ. వీరిద్దరే దీనికి కారణం. ఇందులో నేను చంటి అనే పాత్ర చేశాను. లక్ష్మీగారికి, సమంతకు బాయ్ ఫ్రెండ్ నేనే. నాగ శౌర్య కాళ్లు విరగ్గొట్టుకుని నేనే బాయ్ ఫ్రెండ్ అని ఫీలవుతుంటాడు వేస్ట్ ఫెల్లో... అంటూ రాజేంద్ర ప్రసాద్ సరదా కామెంట్ చేశారు.

ఓ బేబీ సినిమా నాకు గర్వకారణం
ఓ బేబీ సినిమాలో యాక్ట్ చేశాను అని చెప్పడం నాకు గర్వకారణం. ఇందులో అంత మంచి పాత్ర చేశాను. అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ ఉన్నాయి. రెండు సీన్లు మీకు గుర్తుండి పోతాయి. ఒక దాంట్లో సమంత నన్ను జుట్టుపట్టుకుని తంతుంది, మరొక సీన్లో ప్రేక్షకుల గుండెలు పిండే విధంగా అయ్యో వీళ్లు ఇలా అయిపోయారే అని ఫీలవుతారు. ఇది నటుడిగా నాకు ఛాలెంజింగ్ పాత్ర... అని చెప్పుకొచ్చారు.

ఎప్పుడూ తాగి రాలేదు
ఈ సినిమాలో ఓ గమ్మత్తైన సీన్ ఉంది. కూతురు సునైన చేసిన తప్పును కవర్ చేయడానికి ఫుల్లుగా తాగాలి (వాస్తవానికి తాగి నటించలేదు). ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నన్ను ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో జాయిన్ చేసింది పూజ్యులు, పెద్దలు నందమూరి తారకరామారావుగారు. అప్పట్లో సెలవు ఉంటే ఆయనతో కలిసి షూటింగుకు వెళ్లేవాడిని... ఆ రోజు ఏ సీన్ అయితే ఆయన అదే మూడ్లో ఉండేవారు. తాగే సీన్ అయితే తాగినట్లే ఉంటారు. నాకు అది అలవాటైందో ఏమో కానీ... ఓసారి మిడ్ నైట్ షూట్లో తాగినట్లే ప్రవర్తించాను. కట్ చేస్తే ఎవరో యూట్యూబ్‌లో నేను తాగి నటించినట్లు రాశారు. అది నిజం కాదు. 42 సంవత్సరాల్లో నేను ఎప్పుడూ తాగిన యాక్ట్ చేయలేదు. అలా రాయడం వాడి కర్మ.... అని రాజేంద్రప్రసాద్ తెలిపారు.


Click it and Unblock the Notifications











