twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోస్టర్ మీద పేడ వేశారు, డాష్ డాష్ అని తిడుతూ ఎన్టీ రామారావు ఆ రోజు..

    |

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ పార్ట్ గుర్తుకు రాగానే ముందుగా గుర్తుకు వచ్చే టాప్ యాక్టర్లలో రాజేంద్రప్రసాద్ ఒకరు. 'లేడీస్ టైలర్' నుంచి ఇటీవల 'ఎఫ్ 2' వరకు ఆయన తనదైన శైలి వినోదం పంచుతూ ప్రేక్షకులను మెప్పించారు.

    ఇటీవల విజయవాడలో కళా మంజుషా కల్చరల్ అకాడమీ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'లేడీస్ టైలర్' నుంచి ఇటీవల 'ఎఫ్ 2' వరకు ఎన్నో సినిమాల్లో నవ్వించాను. అయితే నా వల్లే సినిమా ఆడుతుంది అనుకునేంత అమాయకుడిని అయితే కాదు. ఒక సినిమా విజయం సాధించింది అంటే దానికి పని చేసిన ప్రతి ఒక్కరూ కారకులే అని తెలిపారు.

    ఎన్టీ రామారావు స్పూర్తితో...

    ఎన్టీ రామారావు స్పూర్తితో...

    ఆ రోజుల్లో ఎన్టీ రామారావు స్పూర్తితో ఇంజనీరింగ్ అయిపోగానే... సినిమా రంగంలోకి వెళ్లడం జరిగింది. దాదాపు 42 సంవత్సరాలు పని చేశాను, ఇంకా పని చేస్తున్నాను. ఇప్పటికీ నేను కావాలని కోరుకుంటూ నాకోసం పాత్రలు రాస్తున్న వారికి నా కృతజ్ఞతలు.

    నా పోస్టర్ మీద పేడ వేశారు

    నా పోస్టర్ మీద పేడ వేశారు

    సినిమాల్లోకి వెళ్లిన తర్వాత తొలి సినిమా విడుదలైన తర్వాత సైకిల్ వేసుకుని బెజవాడలో ఎన్టీ రామారావు గారిని కలిసేందుకు బయల్దేరాను. అలంకార్ టాకీస్ దారిలో వెళుతుంటే నా తొలి పోస్టర్ చూసి ఆనందపడ్డాను. అదే సమయంలో ఒక చోట పోస్టర్ మీద ఎవరో పేడ వేశారు. అది చూసి బాధ పడ్డాను అని రాజేంద్రప్రసాద్ గుర్తు చేసుకున్నారు.

    ఈ విషయం చెబితే రామారావు గారు నవ్వారు

    ఈ విషయం చెబితే రామారావు గారు నవ్వారు

    నా పోస్టర్ మీద పేడ వేయడంతో నేను మొహం అలా పెట్టుకోవడంతో రామారావుగారు మీ బాధేంటో చెప్పండి అన్నారు. ఫస్ట్ టైం బెజవాడలో పోస్టర్ వేశారు. అందులో నా మొహం మీద పేడ వేశారు అంటే ఆయన నవ్వారు.

    బుద్దిలేని గాడిద అని ప్రేమగా...

    బుద్దిలేని గాడిద అని ప్రేమగా...

    నేను బాధ పడుతూ ఆ విషయం చెప్పగానే.. ఆయన చాలా ప్రేమగా బుద్దిలేని గాడిద అని మాట్లాడుతూ, నీ మొహం మీద ఎవడో పేడ వేశాడు అంటే 100 శాతం నీ మీద ఎటెన్షన్ ఉంది. నువ్వు పెరగడం వాడికి కావాలి, నువ్వు పెరుగుతున్నావని అర్థం. దాన్ని ప్రేమగా తీసుకో అన్నారు.

    డాష్ డాష్ అని తిడుతూ..

    డాష్ డాష్ అని తిడుతూ..

    ‘‘మమ్మల్ని కూడా ఎన్టీవోడు ఏం చేశాడురా..( ఒక బూతు మాటతో మాట్లాడి) ఏం పెరిగాడు గాడిద.. బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తాడు డాష్ డాష్ అని అంటారు. మనపై అంత ప్రేమ వారికి'' అని రామారావుగారు తనలో మరింత మనోధైర్యం నింపినట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు.

    English summary
    Rajendraprasad Superb Speech Kala Manjusha Cultural Academy Event. Rajendra Prasad is an Indian film actor who predominantly works in Telugu cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X