twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా బారిన పడిన టాలీవుడ్ సీనియర్ హీరో.. హాస్పిటల్ లో చేరిక.. వైద్యులు ఏమన్నారంటే?

    |

    దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఒమిక్రాన్‌ విజృంభణతో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వెళుతోంది. అయితే కరోనా సామాన్యుల మొదలు సెలబ్రిటీల దాకా ఎవరినీ వదలడం లేదు. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో కరోనా బారిన పడ్డారు. ఆ వివరాలు..

    కొత్తగా 1, 59, 632 కరోనా కేసులు

    కొత్తగా 1, 59, 632 కరోనా కేసులు

    కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా రోజువారీ కేసులు లక్షన్నర దాటాయి. కేసులతో పాటు పాజిటివిటీ రేటు, యాక్టివ్‌ కేసులు కూడా అధికమవుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో రాష్ట్రాలు క్రమంగా కరోనా ఆంక్షలు రెట్టింపు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 1,59,632 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల 3, 55, 28, 004కు చేరాయి.

    3623 ఒమిక్రాన్‌ కేసులు

    3623 ఒమిక్రాన్‌ కేసులు

    ఇందులో 3,44,53,603 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకోగా, 5,90,611 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 4,83,790 మంది మృతి చెందారు. ఇక భారీగా కరోనా కేసులు నమోదవుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 10.21కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 151.58 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ దేశంలో విజృంభిస్తోంది. తాజా కేసులతో ఒమిక్రాన్‌ కేసులు 3623కు పెరిగాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

    అనేక మంది కరోనా బారిన

    అనేక మంది కరోనా బారిన

    ఇందులో 1409 మంది కోలుకున్నారని అత్యధికంగా మహారాష్ట్రలో 1009 కేసులు ఉండగా, ఢిల్లీలో 513, కర్ణాటకలో 441, రాజస్థాన్‌ 373, కేరళ 204, తమిళనాడు 185, హర్యానా, తెలంగాణలో 123 చొప్పున ఉన్నాయని వెల్లడించింది. ఇక ఇప్పటికే బాలీవుడ్‌, టాలీవుడ్‌లో అనేక మంది ప్రముఖులు కొవిడ్‌ బారిన పడ్డారు. బాలీవుడ్ లో ఏక్తా కపూర్, అర్జున్‌ కపూర్‌, స్వరా భాస్కర్‌, సింగర్ విశాల్ డడ్లానీ, దర్శకుడు ప్రియదర్శన్ సహా అనేక మంది కరోనా బారిన పడ్డారు.

     రాజేంద్ర ప్రసాద్‌ కు కరోన

    రాజేంద్ర ప్రసాద్‌ కు కరోన

    ఇక టాలీవుడ్‌లో సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబుకు కరోనా సోకడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఆయన మాత్రమే కాకుండా త్రిష, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, తమిళ నటుడు విష్ణు విశాల్‌ సహా నటుడు సత్యరాజ్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు, సీనియర్‌ హీరో నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్‌ కరోనా బారిన పడ్డారు. అయితే ఆయన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు.

     ఆరోగ్య పరిస్థితి నిలకడగా

    ఆరోగ్య పరిస్థితి నిలకడగా

    ఇక ఈ క్రమంలో ఆయన కొవిడ్‌ స్వల్ప లక్షణాలతో బాధ పడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. రాజేంద్ర ప్రసాద్‌ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు. ఇక ఆయన ఇటీవల సేనాపతి అనే థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పవన్ సాధినేని దర్శకత్వంలో రాకేందుమౌళి, జోష్ రవి ప్రధాన పాత్రధారులుగా వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.

    English summary
    Rajendra prasad tested corona positive.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X