»   »  పవన్ - వెంకీ మూవీలో రాజేంద్ర ప్రసాద్ కూడా?

పవన్ - వెంకీ మూవీలో రాజేంద్ర ప్రసాద్ కూడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన 'ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో అక్షయ్ కుమార్-పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, తెలుగులో పవన్ కళ్యాణ్-వెంకటేష్ కాంబినేషన్లో ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.

హిందీలో అక్షయ్ కుమార్ పోషించిన లార్డ్ కృష్ణా పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషించనున్నాడు. పరేష్ రావల్ పాత్రలో వెంకటేష్ నటించనున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రంలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

 Rajendra Prasad In The Telugu Oh My God?

హిందీలో మిథున్ చక్రవర్తి పోషించిన పాత్రను తెలుగులో రాజేంద్రప్రసాద్ చేస్తారని అంటున్నారు. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఈ చిత్రానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తారనే ఓ వార్త కూడా ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఇంతే కాకుండా రామ్ చరణ్‌తో ఐటం సాంగ్ (స్పెషల్ నెంబర్) చేయించానికి పిల్మ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

ఈ చిత్రం తెలుగులో భారీ మల్టీస్టారర్ కాబోతోందా? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లషకులు. వెంకటేష్, పవన్ కళ్యాణ్ నటించడంతో పాటు రామ్ చరణ్ కూడా స్పెషల్ సాంగు చేయడం, మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం సినిమాను ఓ రేంజికి తీసుకెలుతుందని అంటున్నారు. హిందీలో 'ఓ మై గాడ్' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో 'ఓ దేవుడా' అనే టైటిల్ పెట్టే ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు ఈ టైటిల్ రిజిస్టర్ కూడా చేయించారు.

English summary
The buzz on the road is that Rajendra Prasad is the latest big name to be roped into the Telugu remake of Oh My God. He is said to be playing the part of Mithun Chakraborty, which was one of the crucial roles in the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu