వర్రీ అవుతున్న రాజేంద్రప్రసాద్
కార్పోరేట్ సంస్ధలకు వాటి లెక్కలు వాటికుంటాయి. మన వర్రీలతో వారికి సంభందం ఉండదు. నేను క్విక్ గన్ మురగన్ ని దేశమంతటా ఒకే రోజు రిలీజ్ చేయమన్నాను. అయితే ఫాక్స్ స్టార్ (డిస్ట్రిబ్యూటర్స్)వారు పట్టించుకోకుండా తెలుగు వెర్షన్ ఆపుచేసారు. మేము మా లోపం లేకుండా డబ్బింగ్ అన్ని సరైన సమయంలోనే పూర్తి చేసాం అంటున్నారు రాజేంధ్రప్రసాద్. రైస్ ప్లేట్ రెడ్డి కాంట్రావర్శితోనే సినిమా డిలే అవుతోందేమో అంటే కొట్టిపారేస్తున్నారు.
ఆ విషయం గురించి మాట్లాడుతూ రైస్ ప్లేట్ రెడ్డి అనేది ఫన్ కోసం పెట్టింది కానీ అందులో రెడ్డి కమ్యూనిటీని విమర్శించిందేమీ లేదు. గతంలో నేను అప్పులు అప్పారావు, పేకాట పాపారావు పేరుతో సినిమాలు చేసాను. అంతమాత్రానికి వారందరూ నాపై గొడవలుకొస్తారా..ఏదో సరదా కోసం పేర్లు పెడతాం అన్నారు. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే అంటున్నారు. ఇక ఈ విషయమై రాజేంద్రప్రసాద్ చాలా వర్రీగా ఉంటున్నారని ఆయన శ్రేయాభిలాషులు అంటున్నారు. తన సొంత స్టేట్,బాషలో రిలీజు కాకుండా మిగతా చోట్ల విడుదల కావటం ఆయనకు బాధ కలిగిస్తోందంటున్నారు.


Click it and Unblock the Notifications











