ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు దాదాపు పూర్తి
రాజేంద్రప్రసాద్ అల్లుడుగా, సుమన్ మామగా, సీత, కోవై సరళ అత్తలుగా, కీర్తిచావ్లా, కోవెలహారతి అత్తకూతుళ్ళుగా నటిస్తున్న ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు చిత్రం పాటల చిత్రీకరణ పూర్తయింది. "టిక్... టిక్... టిక్... అంటూ సాయిశ్రీహర్ష రాసిన పాట చిత్రీకరణతో పాటలన్నీ పూర్తయ్యాయి. "ఈ పాటను రాజేంద్రప్రసాద్, కోవెల హారతిపై వేణుపాల్ నృత్యదర్శకత్వంలో చిత్రీకరించాం. ఈ సినిమా ద్వారా ప్రసాద్ అనే సంగీత దర్శకుణ్ణి పరిచయం చేస్తున్నాం అని చిత్ర సమర్పకులు దుర్గం జయంత్ కుమార్ తెలిపారు. ఒక పెళ్ళాం ముద్దు... రెండో పెళ్ళాం వద్దు.. అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందిందని, ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోందని, ఏప్రిల్ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత సుదర్శన చెప్పారు.


Click it and Unblock the Notifications