ముసలి హీరో...కుర్ర హీరోయిన్

By Staff

Rajesh Khanna
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన బాలీవుడ్ స్టార్ రాజేష్ ఖన్నా ఓ ఇవరేళ్ళ కుర్ర హీరోయిన్ ప్రక్కన నటించటానికి రెడీ అయ్యాడు. ఆమె ఓ పాకిస్ధాని అమ్మాయి. పేరు సైరా ఖాన్. ఇక వఫా పేరుతో రెడీ అవుతున్న ఆ చిత్రంలో రెగ్యులర్ మసాలా స్టోరీ ముసలి మొగుడు...కుర్ర పెళ్ళాం కాన్సెప్ట్ ఉంటుంది. డబ్బు కోసం ఆమె భార్య చనిపోయిన వాడైన రాజేష్ ని పెళ్ళి చేసుకుంటుంది. తర్వాత కోరికలు తీర్చుకోవటం కోసం ఓ పడుచు కుర్రాడితో సంభంధం పెట్టుకుంటుంది.

హాట్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ సోదరడు రాకేష్ సావంత్ ఈ సినిమాని డైరక్ట్ చేస్తున్నాడు. అతను గతంలో హాట్ మని వంటి స్కిన్ షొ పిక్చర్ డైరక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చేసి పేరు పోగొట్టుకోవద్దని రాజేష్ ఖన్నా ని బాలీవుడ్ సీనియర్స్ నచ్చచెప్ప చూసారు.కానీ ఆయన వినకుండా ఈ సినిమాలో చేస్తున్నాడు. ఇక ఈ బి గ్రేడ్ సినిమా సెట్స్ పై హీరోయిన్ తో ఆయన సరసాలు కూడా ఆడుతున్నారని యూనిట్ సభ్యులు చెవులు కొరుక్కుంటున్నాడు.

రాజేష్ మాత్రం ఆమెకు ఓ సీనియర్ గా నటనలో శిక్షణ ఇస్తున్నానని కవర్ చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా గురించి చెపుతూ కొత్త రకం ట్విస్టు లున్న మెచ్యూర్డ్ స్టోరీగా అభివర్ణిస్తున్నాడు.సర్లే ఇక్కడితో అయిందా అంటే ఆయన మరో ఎనిమిది సినిమాలు చేయబోతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X