శనివారం ఆస్పత్రి నుండి డిశ్సార్జైన సూపర్ స్టార్ ' రాజేష్ ఖన్నా'
బాలీవుడ్‌లో ఒకప్పటి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా జూన్ 23వ తారీఖున స్వల్ప అస్వస్దత కారణంగా ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. ఐతే ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకోవడంతో నిన్న (శనివారం, జులై 7) డిశ్చార్జి చేసినట్లు రాజేష్ ఖన్నా మాజీ భార్య డింపుల్ కపాడియా తెలిపారు. ఐఎఎన్ఎస్ అనే మీడియా సంస్దతో డింపుల్ కపాడియా ఖన్నా తిరిగి ఇంటికి వచ్చాడు. లీలావతి హాస్పిటల్ నుండి శనివారం డిశ్సార్జి చేశారు. ఇప్పుడు ఖన్నాసంపూర్ణ ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నాడని తెలిపింది.
69 సంవత్సరాల వయసు కలిగిన రాజేష్ ఖన్నాను ముద్దుగా అందరూ కాకా అంటారు. రాజేష్ ఖన్నాని లీలా వతి హాస్పిటల్ నుండి డిశ్శార్జి చేసినప్పుడు ప్రక్కన మాజీ భార్య డింపుల్ కపాడియాతో పాటు కూతరు రింకీ ఖన్నా ఉన్నారు. సుమారు రెండు దశాబ్దాల పాటు హిందీ చలన చిత్ర రంగాన్ని ఏలిన ఖన్నాను భారత తొలి 'సూపర్ స్టార్'గా పేర్కొంటారు. 1969 నుంచి 1972 మధ్యకాలంలో ఒకదాని తర్వాత మరొకటిగా 15 సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఘనత ఆయనకు దక్కుతుంది. 'ఆరాధన', హాథీ మేరే సాథీ', 'ఆనంద్', 'అమర్ ప్రేమ్' వంటి చిత్రాలు ఖన్నా నట జీవితంలో గొప్ప మైలురాళ్లుగా మిగిలిపోతాయి. ఇటీవల హెవెలీ ఫ్యాన్ల యాడ్ లో కనిపించి అభిమానులను అలరించారు.
1973లో డింపుల్ కపాడియాను వివాహం చేసుకున్న ఖన్నా 1984లో ఆమె నుంచి విడిపోయాడు. ప్రస్తుతం వీరు విడివిడిగా జీవిస్తున్నప్పటికీ, విడాకులు తీసుకోలేదు. ఖన్నా పెద్ద కుమార్తె ట్వింకిల్ ఖన్నా కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అక్షయ్ కుమార్‌ను వివాహం చేసుకున్న తర్వాత నట జీవితాన్ని విడిచిపెట్టి ఇంటీరియర్ డెకరేటర్‌గా పనిచేస్తున్నది. ఖన్నా రెండో కూతురు రింకీ ఖన్నా కూడా ఒకటిరెండు సినిమాల్లో నటించింది.
తర్వాత ఆమె లండన్‌లోని ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకొని అక్కడే స్థిరపడింది. కాగా, ఖన్నాతో విడిపోయినప్పటికీ డింపుల్ కపాడియా ప్రస్తుతం ఆయన వెంటేవుండి సపర్యలు చేస్తున్నారు. ఖన్నా కడుపులో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లుగా సమాచారం. ఈ కారణంతో ఖన్నా గత కొన్ని రోజులుగా ఆహారాన్ని కూడా తీసుకోలేదు. అంతక ముందు ఖన్నా అభిమానులు ఆయన నివాసం బయట భారీ సంఖ్యలో గుమికూడగా, ఖన్నా వారికి అభివాదం చేస్తూ విజయానికి గుర్తుగా రెండు వేళ్ళను చూపారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications












