ఆసుపత్రి పాలైన సూపర్ స్టార్
ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ కన్నా ఆసుపత్రి పాలయ్యారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న రాజేష్ ఖన్నా....పరిస్థితి విషమించడంతో అతన్ని ముంబైలోని లీలావతి హాస్పటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి క్రిటికల్ గా ఉంది. రాజేష్ ఖన్నా భార్య డింపుల్ కపాడియా ఆయన్ను దగ్గరుండి చూసుకుంటున్నారు.
ఆసుప్రతి వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఆయన ప్రస్తుతం సినీయర్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం నుంచే ఆయన చాలా వీక్ అయి పోయి కృంగి కృషించి పోయారని తెలుస్తోంది. ఆయన కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు.
మరో వైపు ఆసుపత్రిలో వైద్యులు చేస్తున్న మెడికల్ ప్రొసీడింగ్‌పై రాజేష్ ఖన్నా భార్య డింపుల్ కపాడియా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆమె ఆసుపత్రి అఫీషియల్స్ కి రిపోర్టు చేసినట్లు సమాచారం. రాజేష్ ఖన్నాను రేపు సౌత్ ముంబైలోని మరొక ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











