బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌లో సూపర్ స్టార్ విగ్రహం

By Bojja Kumar

 Rajesh Khanna
ముంబై : బాలీవుడ్ తొలితరం సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా మరణించి నేటితో ఏడాది. జులై 18, 2012న ఆయన స్వర్గస్తులయ్యారు. ఆయన తొలి వర్ధంతిని సందర్భంగా ముంబైలోని బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌ ప్రాంగణంలో రాజేష్ ఖన్నా విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అక్కడ యష్ చోప్రా, దేవానంద్, రాజ్ కపూర్ విగ్రహాలు కొలువై ఉన్నాయి. వాటి పక్కన ఇప్పుడు రాజేష్ ఖన్నా విగ్రహం కూడా చేరనుంది.

బాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం...యూటీవీ స్టార్స్ చానల్ ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విగ్రహాన్ని రాజేష్ ఖన్నా కుటుంబ సభ్యులు ఆవిష్కరించనున్నారు. ఇత్తడి‌ లోహంతో రాజేష్ ఖన్నా విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అభిమానులు, ప్రముఖుల సమక్షంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగనుంది.

1942 డిసెంబర్ 29న అమృత్‌సర్‌లో జన్మించిన రాజేష్ ఖన్నా అసలు పేరు జతిన్ ఖన్నా. 1966లో Aakhri Khat అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన ఇప్పటి వరకు 163 బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. ఉత్తమ హీరోగా 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు. 1969 నుంచి 1972 మధ్యకాలంలో ఒకదాని తర్వాత మరొకటిగా 15 సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 'ఆరాధన', హాథీ మేరే సాథీ', 'ఆనంద్', 'అమర్ ప్రేమ్' వంటి చిత్రాలు ఖన్నా నట జీవితంలో గొప్ప మైలురాళ్లుగా మిగిలిపోతాయి. 1991 నుంచి 1996 వరకు ఎంపీగా పని చేశారు. నటుడుగానే కాకుండా నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. రాజేష్ ఖన్నాను ముద్దుగా అందరూ కాకా అంటారు.

1973లో డింపుల్ కపాడియాను వివాహం చేసుకున్న ఖన్నా 1984లో ఆమె నుంచి విడిపోయాడు. పెద్ద కూతురు ట్వింకిల్ ఖన్నా కొంత కాలం సినిమాల్లో నటించిన అనంతరం బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‍‌ను పెళ్లాడింది. రెండో కూతురు రింకీ ఖన్నా కూడా ఒకటిరెండు సినిమాల్లో నటించింది. తర్వాత ఆమె లండన్‌లోని ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకొని అక్కడే స్థిరపడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X