అల్లు అర్జున్ ద్విభాషా చిత్రం ఖరారు
ప్రస్తుతం బన్నీ 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం చేస్తున్నారు. ఆ తరవాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో చిత్రం ఉంటుంది. ఆ వరుసలోనే స్టూడియోగ్రీన్ సినిమా చేసే అవకాశాలున్నాయి. ఇది తెలుగుతోపాటు తమిళంలోనూ రూపొందుతుందని తెలిసింది.
ఈ మేరకు దర్శకుడు రాజేష్ తమిళ మీడియాతో మాట్లాడుతూ..నేను అల్లు అర్జున్ కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నాను. త్వరలోనే ఓ షేప్ తీసుకున్న తర్వాత వినిపిస్తాను. నా సినిమాలు అల్లు అర్జున్ చూసి చాలా ఎంజాయ్ చేసానని చెప్పారు. నా కథ అల్లు అర్జున్ కి నచ్చుతుందనే భావిస్తున్నాను అన్నారు.
ఇక ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లో ఒకే సారి నిర్మాణం కానుంది. గీతా అర్డ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తారని సమాచారం. ఇక రాజేష్ గతంలో డైరక్ట్ చేసిన ఎస్.ఎమ్ ఎస్ చిత్రం తెలుగులో మహేష్ బాబు బావ సుధీర్ బాబుతో రీమేక్ చేసారు. అలాగే బాస్ ఎనగర్ బాస్కరన్ చిత్రం నేనే అంబాని టైటిల్ తో ఇక్కడ డబ్బింగ్ అయ్యింది. నయనతార,ఆర్య కాంబినేషన్ లో వచ్చిన ఆ చిత్రం తమిళంలో సూపర్ హిట్ గా నమోదైంది.


Click it and Unblock the Notifications












