twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ ద్విభాషా చిత్రం ఖరారు

    By Srikanya
    |

    హైదరాబాద్: స్టూడియోగ్రీన్‌ సంస్థ నేరుగా తెలుగులో చిత్రాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. తొలి ప్రయత్నంగా అల్లు అర్జున్‌ హీరోగా సినిమా నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఎమ్‌.రాజేష్‌ దర్శకత్వం వహిస్తారు. ఈయన తమిళ చిత్రసీమకు చెందిన దర్శకుడు. గతేడాది విడుదలైన అనువాద చిత్రం 'ఓకే ఓకే'కి ఆయనే దర్శకుడు.

    ప్రస్తుతం బన్నీ 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం చేస్తున్నారు. ఆ తరవాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో చిత్రం ఉంటుంది. ఆ వరుసలోనే స్టూడియోగ్రీన్‌ సినిమా చేసే అవకాశాలున్నాయి. ఇది తెలుగుతోపాటు తమిళంలోనూ రూపొందుతుందని తెలిసింది.

    ఈ మేరకు దర్శకుడు రాజేష్ తమిళ మీడియాతో మాట్లాడుతూ..నేను అల్లు అర్జున్ కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నాను. త్వరలోనే ఓ షేప్ తీసుకున్న తర్వాత వినిపిస్తాను. నా సినిమాలు అల్లు అర్జున్ చూసి చాలా ఎంజాయ్ చేసానని చెప్పారు. నా కథ అల్లు అర్జున్ కి నచ్చుతుందనే భావిస్తున్నాను అన్నారు.

    ఇక ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లో ఒకే సారి నిర్మాణం కానుంది. గీతా అర్డ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తారని సమాచారం. ఇక రాజేష్ గతంలో డైరక్ట్ చేసిన ఎస్.ఎమ్ ఎస్ చిత్రం తెలుగులో మహేష్ బాబు బావ సుధీర్ బాబుతో రీమేక్ చేసారు. అలాగే బాస్ ఎనగర్ బాస్కరన్ చిత్రం నేనే అంబాని టైటిల్ తో ఇక్కడ డబ్బింగ్ అయ్యింది. నయనతార,ఆర్య కాంబినేషన్ లో వచ్చిన ఆ చిత్రం తమిళంలో సూపర్ హిట్ గా నమోదైంది.

    English summary
    
 
 Telugu actor Allu Arjun seems to be the latest actor to set his eyes on the Tamil market. The actor, who had earlier expressed his wish to work in Kollywood, is reportedly in touch with many K-town directors including M Rajesh to direct his first film in Tamil. The buzz says that M Rajesh is likely to launch Allu Arjun in Tamil film industry. The actor, who has also discussed a few scripts with director like Selvaraghavan, seems to have shown interest to work with the Boss Engira Bhaskaran filmmaker. Reports further add that Allu is not keen on dubbing his Telugu film in Tamil and want to do a straight film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X