Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Dahini: మంత్రగత్తెల కోసం అన్వేషణ.. జేడీ చక్రవర్తి సినిమాకు అవార్డు
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న జాతీయ అవార్డు గెలుపొందిన యాక్టర్ తన్నిష్ఠ ఛటర్జీ, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'దహిణి-మంత్రగత్తె'. ఈ సినిమాకు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డ్స్ అందుకున్న డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ దర్శకత్వం వహించారు. ఇందులో జేడీ చక్రవర్తి ఎప్పుడు కనిపించని వైవిధ్యమైన పాత్రలో అలరించాడు. ఆషికీ హుస్సేన్, బద్రూల్ ఇస్లామ్, అంగనా రాయ్, రిజ్జు బజాజ్, జగన్నాథ్ సేథ్, శ్రుతీ జయన్, దిలీప్ దాస్ వంటి నటులతో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే పలు అవార్డులను అందుకుంది. తాజాగా ఈ సినిమాకు మరో అవార్డు దక్కింది.

సమాజంలోని సమస్యలే కథలు..
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ తెరకెక్కించిన మరో డిఫరెంట్ మూవీ దహిణి-మంత్రగత్తె. ప్రజలను చైతన్యవంతులను చేయాలనే తపన ఆయన ప్రతి సినిమాలో కనిపిస్తుంది. సమాజంలో సమస్యలనే ఆయన కథలుగా ఎంపిక చేసుకుంటారు. దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి ఆయనది అదే పంథా.
గతంలో ఎన్నో సమస్యలను సినిమాల ద్వారా ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు 'విచ్ హంటింగ్' పేరుతో పలు రాష్ట్రాలలో జరుగుతున్న దారుణాలను వెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నంతో... వివాదాస్పద అంశాలను స్పృశిస్తూ 'దహిణి' తెరకెక్కించారు.

17 రాష్ట్రాల అన్వేషణలో..
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వేదికలపై దహిణి-మంత్రగత్తె అద్భుతమైన స్పందనతోపాటు పలు అవార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు ఫసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ వేడుకల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నిలిచింది. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో బెస్ట్ ఫీచర్ మూవీగా నామినేట్ అయింది.
ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన టైటాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా ఈ సినిమాకు అవార్డు దక్కింది. ఈ సినిమా ఒక సోషల్ థ్రిల్లర్. భారతదేశంలోని 17 రాష్ట్రాల అన్వేషణలో ఉన్న మంత్రగత్తె కథగా ఈ సినిమా తెరకెక్కింది.

వాస్తవికతకు దగ్గరగా..
ఒరిస్సాలోని మయూర్ బంజ్ జిల్లా, పరిసర ప్రాంతాల్లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా, వాస్తవికతకు దగ్గరగా 'దహిణి' చిత్రాన్ని రూపొందించారు. పాపులర్ తెలుగు యాక్టర్ జేడీ చక్రవర్తి, తన్నిష్ఠ ఛటర్జీ, ప్రధాన పాత్రలో జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ దర్శకుడు రాజేష్ టచ్‌రివర్ తెరకెక్కించిన సినిమా 'దహిణి'.
ఓరియన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, సన్‌టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను పద్మశ్రీ అవార్డు గ్రహీత, మానవతావాది సునీత కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా నిర్మించారు.