రాజశేఖర్ విలన్ గా ఎంట్రి, హీరో, డైరెక్టర్ ఎవరో తెలుసా?

ప్రవీణ్ సత్తార్ తాజాగా ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో ఆకట్టుకున్న రామ్ హీరోగా సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో ఒక సీనియర్ హీరో విలన్ గా నటిస్తున్నాడు.

రామ్ తో హిట్ డైరెక్టర్
సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన పీయస్‌వీ గరుడవేగ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తాజాగా ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో ఆకట్టుకున్న రామ్ హీరోగా సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

స్రవంతి మూవీస్
మే 7 నుంచి జార్జియాలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా మే నెలాఖరు వరకు తొలి షెడ్యూల్ సాగుతుంది. ఆ తర్వాత స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీలోని కొన్ని ప్రదేశాలో చిత్రీకరణ జరుపుకుంటుంది. శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది.

రామ్ పక్కన మాళవిక
రామ్ సరసన మాళవిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ రవితేజ సరసన నేల టికెట్ సినిమాలో నటిస్తోంది. ఒక సినిమా విడుదల కాకముందే మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ హీరోయిన్. రామ్ సినిమాలో తన పాత్ర నచ్చడంతో వెంటనే ఓకె చెప్పేసిందట ఈ హీరోయిన్.

రాజశేఖర్ విలన్ గా
ఈ సినిమాలో రాజశేఖర్ విలన్‌గా నటిస్తున్నారట. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు అడగడంతో రాజశేఖర్ వెంటనే ఒప్పుకోవడం జరిగిందని సమాచారం. గతంలో కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలు అవకాశాలు వచ్చినా రాజశేఖర్ చెయ్యలేదు. కాని ఈ సినిమా చెయ్యడం విశేషం.


Click it and Unblock the Notifications











