రజనీ 'దళపతి' హిందీ రీమేక్ డిటేల్స్
రజనీకాంత్ కెరీర్ లో మంచి హిట్ గా నిలిచిన దళపతి చిత్రం హిందిలోకి రీమేక్ కానుంది. బాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ భరత్ షా ఈ చిత్రం రైట్స్ తీసుకున్నారు. సునీల్ శెట్టి హీరో గా ఈ చిత్రంలో చేయనున్నారు. పూజా జితేందర్ బేజీ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనుంది. ప్రస్తుతం ఆమె ఘోస్ట్ అనే చిత్రం డైరక్ట్ చేస్తోంది. ఈ చిత్రం ఏప్రియల్ 2012లో ప్రారంభం కానుంది. ఇక ఒరిజనల్ దళపతి చిత్రాన్ని మణిరత్నం తమిళంలో డైరక్ట్ చేసారు. తెలుగులో డబ్ అయ్యి ఇక్కడ కూడా బాగా ఆడింది. ఈ చిత్రంలో రజనీతో పాటు ముమ్మట్టి, శోభన, అరవింద్ స్వామి, అమ్రీష్ పూరి, భానుప్రియ, శ్రీ విద్య తదితరలు నటించారు. 1991లో విడుదల అయిన ఈ చిత్రం మహాభారతంకు ఆధునీకరణ చేసి తెరకెక్కించారు. ఇళయరాజా అందించిన సంగీతం ఈ చిత్రం విజయానికి బాగా తోర్పడింది.
ఇక ఈ చిత్రం ఓ యాక్షన్ ధ్రిల్లర్ గా మణి రత్నం తెరకెక్కించారు. నిర్మాత విషయానికి వస్తే భరత్ షా గతంలో వర్మ వంటి టాప్ బాలీవుడ్ దర్శకులుతో సినిమాలు నిర్మించారు. ప్రసుతం బాలీవుడ్.. సౌత్ సినిమాలను దిగుమతి చేసుకుని రీమేక్ చేసుకుంటూ కాలం గడుపుతోంది. తెలుగునుంచి సైతం కిక్, రెడి, ఆర్య 2, డాన్ శీను, అనసూయ వంటి చిత్రాలు సైతం రీమేక్ అయ్యాయి.. ఇంకొన్ని భవిష్యత్ లో కార్య రూపం దాల్చనున్నాయి.


Click it and Unblock the Notifications











