రజనీకాంత్ - శంకర్‌ల సినిమా 'రోబో'. దీనికి సంబంధించి ఓ పాట చిత్రీకరణ ఇటీవలే బ్రెజిల్‌లో పూర్తయింది. రజనీ, ఐశ్వర్యరాయ్ కలిసి నర్తించిన ఈ పాటకు రాజు సుందరం నృత్యరీతులు సమకూర్చారు. స్పానిష్ సాల్సా నృత్యాన్ని అనుసరించి సాగుతుందట. అలాగే మరో గీతం చిత్రీకరణ కూడా త్వరలో హవాయి ద్వీపంలో మొదలవుతుంది. దాని నిమిత్తం రజనీ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. పాటలు హైలెట్ చెయ్యాలని రజనీ ప్రత్యేకంగా శంకర్ ని కోరటంతో వీటిపై ప్రత్యేక శ్రధ్ద పెడుతున్నట్లు చెబుతున్నారు. అలాగే స్పానిష్ సల్సా నృత్యం మొదటి సారిగా ఇండియన్ సినిమాలో వాడిన ఘనత కూడా రొబో కే దక్కుతుందని తెలుస్తోంది.
Story first published: Sunday, May 17, 2026, 7:36 [IST]