twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హుద్‌హుద్‌: రజనీ సాయం ప్రకటించారు...ఎంతంటే

    By Srikanya
    |

    హైదరాబాద్ :''కొన్ని కారణాల వల్ల 'మేము సైతం' కార్యక్రమానికి హాజరు కాలేకపోయా. హుద్‌హుద్‌ బాధితులకు త్వరలో నా సహాయం ప్రకటిస్తా'' అని ఇటీవల హైదరాబాద్‌ వచ్చినప్పుడు మాటిచ్చారు సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌. ఇప్పుడు తన సహాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరఫున తన వంతుగా రూ.ఐదు లక్షల చెక్‌ పంపించారు.

    ''హుద్‌హుద్‌ విలయతాండవం నన్ను కదిలించింది. ఎన్నో కుటుంబాల్ని దిక్కులేని స్థితిలో పడేసింది. వాళ్లందరికీ నా ప్రగాఢ సానుభూతి. భగవంతుడు తనకు తోచిన విధంగా చేసుకొని పోతుంటాడు. మనం శిరస్సు వంచడం మినహా ఏం చేయలేం'' అని ఓ ప్రకటనలో తెలిపారు రజనీకాంత్‌.

    https://www.facebook.com/TeluguFilmibeat

    Rajini donates 5 Lakhs for Hudhud fund

    ఆయన తాజా చిత్రం లింగా విషయానికి వస్తే...

    రజనీకాంత్‌ హీరోగా రూపొందిన ‘లింగ' చిత్రం ఆయన జన్మదినం సందర్భంగా వారం క్రితం అత్యధిక థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ ని మూట కట్టుకుంది. దాంతో రెండో రోజు నుంచి కలెక్షన్స్ చాలా చోట్ల డ్రాప్ అయ్యిపోయాయి. అనుష్క,సోనాక్షి వంటి హీరోయిన్స్, భారీ సెట్టింగ్స్, అన్నిటికి మించి సూపర్ స్టార్ ఉన్నా కథ బాగోలేకపోవటం బోల్తా కొట్టింది.

    కొత్త తలనొప్పి...

    ఈ సినిమాకు రివ్యూలు నెగెటివ్‌గా రావడం, మౌత్ టాక్ కూడా అనుకూలంగా లేక పోవడంతో తొలి వారం గడిచే నాటికి డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రం నష్టాలు మిగిల్చింది. ఈ చిత్రాన్ని రాక్ లైన్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్లో రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు. ఆయన ఈచిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు అమ్మగా.....ఆ సంస్థ వద్ద నుండి లోక్ డిస్ట్రిబ్యూటర్లు సినిమాను కొనుగోలు చేసి ప్రదర్శిస్తున్నారు. తమిళనాడులోని పలు ఏరియాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లంతా భారీగా ధర చెల్లించి ఈరోస్ సంస్థ నుండి రైట్స్ కొనుగోలు చేసారు.

    అయితే సినిమా ఆడక నష్టాల పాలు కావడంతో.....డిస్ట్రిబ్యూటర్లంతా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. తమ నష్టాలను భర్తీ చేయాల్సిందిగా రజనీకాంత్ ను డిమాండ్ చేస్తున్నారు. గతంలో రజనీకాంత్ తన సినిమాల వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ సారి ఏ చేస్తారు అనేది చర్చనీయాంశం అయింది. కానీ...కొందరు మాత్రం డిస్ట్రిబ్యూర్ల చర్యను వ్యతిరేకిస్తున్నారు. సినిమా అనేది వ్యాపారం. లాభాలు, నష్టాలు ఉంటాయి. రజనీకాంత్ ను ఇబ్బంది పెట్టడం తగదని అంటున్నారు.

    కథ ఏమిటంటే...

    లింగా(రజనీ) ఓ చిన్న దొంగ...అతని ఫ్రెండ్స్(సంతానం)తదితరులతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూన్న అతన్ని పబ్లిక్ టీవి రిపోర్టర్ లక్ష్మి(అనుష్క) ఓ సారి జైలు నుంచి బయిటకు తీసుకు వస్తుంది. అయితే ఓ కండీషన్ పెడుతుంది..అదేమిటంటే... శింగనూర్ అనే ఓ గ్రామం వచ్చి అక్కడ అతని తాతగారు రాజా లింగేశ్వర(ఇంకో రజనీ) కట్టించిన గుడిని ఓపెన్ చెయ్యాలని. అయితే మొదట లింగా రిజెక్టు చేస్తాడు...తమని ఈ దొంగతనాలు చేసే స్ధితికి వెళ్ళేలే చేసి, దరిద్రంలో వదిలిన తమ తాత అంటే అసహ్యమని చెప్తాడు. అయితే తప్పని సరి పరిస్దితుల్లో అక్కడికి వెళ్తాడు. అక్కడ లక్ష్మి తాతగారు(కె. విశ్వనాధ్) ఆ గుడి గురించి ఓ రహస్యం చెప్తాడు.

    అది విన్న లింగా ఆ గుడిని ఓపెన్ చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. అయితే లోకల్ ఎంపి నాగ భూషణం(జగపతిబాబు) అతనో దొంగ అని కుదరదంటాడు. ఈ లోగా లింగా తన తాతగారి గురించి ఓ షాకింగ్ నిజం తెలుసుకుంటాడు. ఆయన గద్వాల్ రాజా లింగేశ్వరావు అని... ఆ రోజుల్లోనే(1940) కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన ఓ ఇంజినీంరు అని, మధురై కలెక్టర్ అని అర్దం చేసుకుంటాడు. అంత గొప్ప తన తాత తాము ఎందుకు ఇలా దరిద్రంతో బ్రతకాల్సి వస్తోంది. ఆ గుడికి ఉన్న రహస్యం ఏమిటి...ఇంతకీ తన తాత కట్టించిన డ్యామ్ గురించి అతను ఏం తెలుసుకున్నాడు..ఏం చేసాడు...మిగతా విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

    English summary
    Rajinikanth has donated 5 Lakhs for the welfare of Hudhud Cyclone affected Vishakapatnam. It is said that the actor has sent the cheque to the Chief Minister's Welfare Fund and also urged his fans in the Telugu States to do their bit to help the victims in distress.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X