అల్లుడిని అభినందిస్తూ రజనీకాంత్ ట్వీట్, కమల్ కూడా...

By Bojja Kumar

హైదరాబాద్: ధనుష్‌ సహ నిర్మాతగా దర్శకుడు వెట్రిమారన్ నిర్మించి, తెరకెక్కించిన ‘విశారణై'కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని రజనీకాంత్ కూడా అభినందించారు. ఈ మేరకు ట్విట్టర్లో తమిళంలో ట్వీట్ చేసారు. ‘విశారణై'లాంటి సినిమాను తమిళ సినిమాలో ఇప్పటివరకు నేను చూడలేదు. అంతర్జాతీయ సినిమాల సరసన ఒక తమిళ సినిమా. వెట్రిమారన్, ధనుష్‌కి శుభాకాంక్షలు' అంటూ రజనీకాంత్ ట్వీట్‌ చేశారు. కమల్ హాసన్ కూడా ఈ సినిమా చూసి అభినందించారు.

‘విశారణై' ఈ చిత్రంలో దినేష్‌, సముద్రగని, కిషోర్‌, తెలుగు నటుడు అజయ్‌గోష్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులు అందుకుంది. ధనుష్ ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా డిఫరెంటు చిత్రాలూ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

Rajini and Kamal's Tweet about Visaranai

రజనీకాంత్ ప్రస్తుతం ‘కబాలీ' షూటింగులో...
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కబాలి'. ఈ ఫిబ్రవరి నుంచి ఈ చిత్ర షూటింగ్‌ మలేషియాలో జరగనున్న సంగతి తెలిసిందే. తెలుగులోనూ అదే పేరుతో డబ్బింగ్ అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం మలేషయాలో షూటింగ్ జరుపుకుంటోంది. నెక్స్ట్ మంత్ ఎండింగ్ అంటే పిభ్రవరి 28 వరకు ఈ చిత్రం షూటింగ్ కంటిన్యూగా జరుగుతుందిని నిర్మత కలైపులి ఎస్ ధాను తెలిపారు.

అలాగే ...తమిళంలోను, తెలుగులోనూ మే నెలలో ఒకేసారి రిలీజ్ చేయ్యాడానికి ప్లాన్ చేస్తున్నారని, ఆడియోను ఏప్రిల్ లో విడుదల చేయ్యాడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో రజనీ గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు వర్షన్ కు సంబందించి సంగీత దర్ళకుడు సంతోష్ నారాయన్, లిరిక్స్ రాసేది సిరివెన్నెల, చంద్రబోస్ మరియు అనంత శ్రీరామ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X