రజనీకాంత్ ప్రధాన పాత్రలో పి.వాసు రూపొందించిన 'కధానాయుకుడు' సినిమా అక్షరాలా అరవై కోట్ల వ్యాపారం చేసిందన్న సంగతి తెలిసిందే. పిరమిడ్ సాయి మీర వారు ఈ చిత్రాన్ని భారీ మొత్తం ఇచ్చి ఎగ్జిబిషన్ రైట్స్ తీసుకున్నారు. ఇక ఆ సినిమాలో రజనీ కనపడేది గంట మాత్రమే.అంటే అరవై నిముషాలు...అంటే నిముషానికి కోటి చొప్పున ఆయన పేరుతో బిజెనెస్ అయ్యిందన్నమాట. ఇక మిగతా సినిమా అంతా తెలుగులో జగపతిబాబు,తమిళ్ లలో పశుపతి పాత్రల చుట్టూ తిర్గుతుంది. ఇంతకు ముందు 'శివాజీ' అంచనాలను మించి రికార్డు స్ధాయిలో కలెక్షన్స్ వసూలు చేసి లాభాలు తెచ్చి పెట్టడంతో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. శుక్రవారం రిలీజయ్యే ఈ సినిమాకు అంతటా దాదాపు వారం దాకా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి.