రజనీకాంత్-మహేష్ బాబు కాంబినేషన్లో మల్టీస్టారర్?(ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్లో మల్టీస్టారర్ చిత్రం త్వరలో రాబోతుందా? అనే ప్రశ్నకు అవుననే జవాబు వస్తుంది. గతంలో రజనీకాంత్ ‘రామ్ రాబర్ట్ రహీమ్' తెలుగులో, ‘మేరా అదాలత్' హిందీలో, ‘మహగురు' చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత యు.సూర్యనారాయణబాబుకు రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అదే విధంగా మహేష్ బాబు కూడా రజనీకాంత్ తో కలిసి నటించేందుకు తన అంగీకారాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిర్మాత యు.సత్యనారాయణ బాబు గతంలో సూపర్ స్టార్ కృష్ణ, రజనీకాంత్ కాంబినేషన్లో ‘అన్నాదమ్ముల సవాల్' తదితర చిత్రాలను నిర్మించారు. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ‘శంఖారావం, బజారు రౌడీ' చిత్రాలను నిర్మించారు. పద్మావతి పిక్చర్సర్స్ బేనర్ పై తెలుగు, కన్నడ, హిందీ బాషల్లో 30కి పైగా చిత్రాలను నిర్మించారు. సూర్య నారాయణ బాబు కృష్ణ గారికి బాగా దగ్గరి బంధువు. కృష్ణ గారి చెల్లెలిని వివాహం చేసుకున్నారు. మహేష్ బాబుకు మేనమామ అవుతారు.

స్లైడ్ షోలో నిర్మాత సూర్యనారాయణబాబు ఇటీవల రజనీకాంత్‌ను కలిసిన దృశ్యాలు...

రజనీకాంత్‌ను కలిసిన నిర్మాత

రజనీకాంత్‌ను కలిసిన నిర్మాత


అసలు విషయంలోకి వెళితే...ప్రముఖ నిర్మాత కె.సి.యస్.చంద్రు ఇటీవల రజనీకాంత్‌ను కలిసారు. వారి సంభాషణలలో సూర్యనారాయణ బాబు ప్రస్తావన వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న సూర్యనారాయణబాబు మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో ఉన్న రజనీకాంత్‌ని కలిసారు. ఆయన వెంట నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కూడా వెళ్లారు. కుశల ప్రశ్నల అనంతరం సినిమాలు తీయడం లేదేమిటని వారిని ప్రశ్నించారు రజనీకాంత్.

మల్టీ స్టారర్ చిత్రం

మల్టీ స్టారర్ చిత్రం


రజనీకాంత్ ప్రశ్నకు సూర్యనారాయణబాబు సమాధానం ఇస్తూ...ఒకప్పటి మీ నిర్మాతను కదా..మీరు సరేనంటే మీతో చిత్రం చేయడానికి సిద్ధమే అన్నారు'. అయితే తాను చేస్తున్న ‘లింగా' చిత్రం పూర్తయిందనీ, ‘కొచ్చాడియాన్' చిత్రాన్ని నిర్మించిన ఈరోస్ పిర్చర్స్ వారికి మరో చిత్రం చేసిన తర్వాత మీకోసం చిత్రం చేయడానికి అభ్యంతరం లేదని, నాడు కృష్ణ గారితో కలిసి చేసిన మల్టీస్టారర్ చిత్రం మాదిరిగా ఉంటే బాగుంటుందని రజనీకాంత్ సూచించారు.

మహేష్ బాబు అంగీకారం

మహేష్ బాబు అంగీకారం


ఇదే విషయాన్ని కృష్ణ కుటుంబానికి సన్నిహితుడైన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, సూపర్ స్టార్ మహేష్ బాబుని కలిసి చెప్పినపుడు, తనకూ మల్టీస్టారర్ చిత్రం చేయడం ఇష్టమేనని మహేష్ బాబు తెలిపారు. ఈ విషయాన్ని నిర్మాత సూర్యనారాయణ బాబు ధృవీకరిస్తూ ‘రజనీకాంత్, మహేష్ బాబుల డేట్స్‌కు అనుకూలంగా చేసేందుకు సిద్ధమే' అన్నారు. కృష్ణ, రజనీకాంత్ కలిసి చేసిన మల్టీస్టారర్ చిత్రం తరహాలోనే ఈ సినిమా కూడా ఉంటుందన్నారు.

అన్ని కలిసొస్తే సినిమా ఓకే...

అన్ని కలిసొస్తే సినిమా ఓకే...


కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘వీరిద్దరి కాంబినేషన్ తో మల్టీస్టారర్ చిత్రం రూపొందేందుకు పరిస్థితులు అనుకూలించడం సంతోషదాయకం' అన్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన సూర్యనారాయణబాబు లాంటి నిర్మాత మళ్లీ నిర్మాణ రంగంలోకి రావడం ఆనందంగా ఉందన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X