»   » తలైవాతో తలపడబోతున్న మహేష్ బాబు, అల్లు అర్జున్!

తలైవాతో తలపడబోతున్న మహేష్ బాబు, అల్లు అర్జున్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వచ్చే ఏడాది వేసవిలో బాక్సాఫీసు వద్ద ఆసక్తికరమైన పోటీ జరుగబోతోంది. ముగ్గురు స్టార్ హీరోల మధ్య రసవత్తరమైన పోటీ ఉండబోతోంది. ఈ ముగ్గురు సినిమాలు ఒకే సమయంలో విడుదలకు సిద్ధం అవుతుండటమే ఇందుకు కారణం. ఆ ముగ్గురు హీరోలు మరెవరో కాదు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ సూపర్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

రజనీకాంత్ ప్రస్తుతం రంజిత్ దర్శకత్వంలో తెలుగు, తమిళం ద్విబాషా చిత్రం (కబాలి)లో నటిస్తున్నాడు. ఈ సినిమాను తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఏప్రిల్ 10న విడుదల చేయాలని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికే విడుదల కావాల్సి ఉన్నా షూటింగ్ లేటవడంతో సినిమా విడుదల కూడా వాయిదావేసారు.

Rajini, Mahesh, Bunny To Compete

మరో వైపు మహేష్ బాబు హీరోగాతెరక్కుతున్న ‘బహ్మోత్సవం' కూడా ఏప్రిల్ 8న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని యూనిట్ సభ్యులు అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో మహేష, రనీకాంత్ పోటీఖాయం అయింది.

దీంతో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ‘సరైనోడు' కూడా ఏప్రిల్ నెలలోనే విడుదలకు కాబోతోంది. ఏప్రిల్ నెలలో విడుదల చేయడాన్ని అల్లు అర్జున్ లక్కీగా భావిస్తున్నాడు. గతంలో ఆయన సినిమాలు రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఇదే సమయంలో విడుదలై మంచి విజయం సాధించాయి.

English summary
Come April, we will see the competition between three big stars of South Indian film industry as their latest movies are set to release around the same time with not much gap among the releases.
Please Wait while comments are loading...