తన పేరు దుర్వినియోగం అంటూ కోర్టుకెక్కిన రజనీకాంత్
హైదరాబాద్: తన అనుమతి లేకుండా తన పేరును వాడుకుంటున్నారని, దుర్వినియోగం చేస్తున్నారని సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కోర్టుకెక్కారు. ‘మై హూ రజనీకాంత్' అంటూ ఓ సినిమాకు టైటిల్ పెట్టిన నేపథ్యంలో రజనీకాంత్ మద్రాసు హై కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. తన అనుమతి లేకుండా తన పేరును వాడుకున్నారని రజనీకాంత్ తన పిటీషన్లో ఆరోపించారు. దీంతో కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 22కు వాయిదా పడింది.

‘మై హూ రజనీకాంత్' అనేది ఓ హిందీ చిత్రం. ఫైజల్ సైఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సరోజ్ నిర్మిస్తున్నారు. ఆదిత్యయ మీనన్, కవితా రాధేశ్యామ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదొక కామెడీ చిత్రం. బప్పి లహరి, సాహిబని కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.
అయితే ఈచిత్రం రజనీకాంత్ జీవిత చరిత్ర గురించి అస్సలుకాదని.....అసలు ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రస్తావ ఉందని, అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా ఎలాంటి సన్నివేశాలు ఉండబోవని దర్శకుడు ఫైజల్ సైఫ్ గతంలో స్పష్టం చేసారు. కేవలం ఇది వినోదాత్మక చిత్రం, ఎవరినీ ఉద్దేశించి ఈ చిత్రం ఉండదు అంటున్నారు.


Click it and Unblock the Notifications











