రజనీకాంత్ పాపులర్ పన్నెండు పంచ్‌లు!
హైదరాబాద్: సూపర్‌స్టార్ రజనీకాంత్ బుధవారం అరుదైన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. శతాబ్ధానికి ఒక్కసారి మాత్రమే వచ్చే మేజిక్ నెంబర్ 12.12.12న అంటే బుధవారం 63వ పడిలో అడుగుపెడుతున్నారు రజనీ. మేజిక్ నెంబర్ మొత్తం కలిపితే 36. రజనీ సినీ పరిశ్రమకి వచ్చి కూడా ఈ ఏడాదితో 36 ఏళ్లు పూర్తయ్యింది.
ఇలా ఆయన సినీజీవితం 12.12.12తో ముడిపడివుంది. సినిమా ప్రపంచంలోనే రజనీకి మాత్రమే దక్కిన అరుదైన సందర్భమిది. అందుకే రజనీ జన్మదినాన్ని అత్యంత ఘనంగా జరుపేందుకు కుటుంబ సభ్యులు, అభిమానులతోపాటు పరిశ్రమ కూడా సిద్ధమైంది. ఈ సందర్భంగా రజనీ పలు చిత్రాల్లో చెప్పిన డైలాగులులో పన్నెండు పాపులర్ పంచ్ లు మీకోసం...
1. 16 వయదినిలే - ఇదు ఎప్పడి ఇరుక్కు (ఇదెలాగుంది..?)
2. జాని - ఇంద ఉలగత్తుల ఒన్నవిడ ఒన్ను బెటరాదాన్ తెరియుం
(ఈ ప్రపంచంలో ఒకటికన్నా మరొకటి బెటర్‌గానే కనిపిస్తుంది)
3. నెట్రిక్కన్ - నాన్ ఈశ్వరన్ ఇల్లడా.. కోడీశ్వరన్!
(నేను ఈశ్వరుడు కాదురా.. కోటీశ్వరుణ్ని)
4. ఎంగేయో కేట్టకురల్ - కైయలవు కాసు ఇరుందాల్ అదు నమ్మ కాపాత్తుం. అదువే కళుత్తళవు ఇరుందా అద నామ కాప్పాత్తనుం.
(చేతినిండా డబ్బుంటే అది మనల్ని కాపాడుతుంది. అదే పీకలవరకు డబ్బుంటే.. దాన్ని మనమే కాపాడాలి.)
5. ధర్మదురై - నల్లవనా ఇరుక్కనుం, ఆనా రొంబ నల్లవనా ఇరుక్క కూడాదు.
(మంచివాడిలా ఉండాలి. కానీ చాలా మంచోడిగా ఉండకూడదు.)
6. బాషా- నాన్ ఒరుతడవ సొన్నా నూరు తడవ సొన్నామాదిరి
(నేను ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్టే)
7. అన్నామలై - నేను సొల్లరదయుం సెయ్‌వేన్. సొల్లాదయయుం సైవేన్
(నేను చెప్పిందీ చేస్తా. చెప్పనిదీ చేస్తా)
8. ముత్తు - కిడైక్కరదు కిడైక్కామ ఇరుక్కాదు. కిడైక్కామ ఇరుక్కరదు కిడైక్కాదు.
(దక్కేది దక్కకుండా ఉండదు. దక్కకుండా ఉండేది దక్కదు.)
9. అరుణాచలం - ఆండవన్ సొల్రాన్. అరుణాచలం ముడిక్కరాన్
(దేవుడు శాసిస్తాడు. అరుణాచలం పాటిస్తాడు)
10. పడయప్పా - ఎన్ వళి తనీ... వళి!
(నాదారి.. రహదారి)
11. బాబా - గతం గతం.. ముడిందదు ముడింజిపోచ్చి
(గతం.. గతః, ముగిసింది.. ముగిసినట్టే)
12. శివాజి - పేర కేట్టాలే సుమ్మా అదురుదల్లా
(పేరు వింటేనే అదుర్స్ కదూ..!)


Click it and Unblock the Notifications












