Don't Miss!
- News భారత్లో పెట్టుబడులపై ఎలాన్ మస్క్ యూటర్న్?
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
హిట్ కొట్టిన చిట్టి ‘రోబో’ ఒక్క నెలకి 500కోట్లు కలెక్ట్ చేస్తుందట...!
సన్ పిక్చర్స్ పతాకంపై సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా, శంకర్ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మించిన చిత్రం 'రోబో". అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం (01.10.2010) భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి షో నుంచే సూపర్ డూపర్ హిట్ టాక్ తో విజయకేతనం ఎగరేసింది. ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోన్న ఈ రోబో ఇండియాలో రాక్ చేస్తోందని, ఇండియన్ సినిమా ట్రేడ్ అనలైసిస్ ప్రకారం ఇండియన్ సినిమాల రికార్డ్స్ ను బ్రేక్ చేయడం కాయమని నిర్థారించింది.
ఒక న్యూస్ చానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియన్ ట్రేడ్ అనలైసిస్ ప్రకారం రజనీకాంత్ రోబో సినిమా ఒక్క అక్టోబర్ నెలలోనే రూ.400 కోట్లు- రూ. 500కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనావేస్తున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయి శతదినోత్సవం జరుపుకోగలిగితే రూ.600కోట్లు-రూ. 700కోట్ల కలెక్ట్ చేస్తుందని జ్యోష్యం చెబుతున్నారు. అలా కలెక్ట్ చేసినట్లైతే ఇండియాలో బిగ్గెస్ట్ సినిమా అవుతుందని అందులో 3ఇడియట్స్ ఇప్పటివరకు కలెటక్ట్ చేసిన రూ.340కోట్ల డబుల్స్ కలెక్ట్ చేసిన సినిమాగా చరిత్రలో నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనావేస్తున్నాయి.