రజనీకాంత్ 'రోబో' చిత్రం రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన కన్నారావు
నాకు చాలా ఆనందంగా ఉంది..ఇంత ప్రెజ్టేజియిస్ సినిమాని నా బ్యానర్ పై విడుదలచేయటం. నాకు ఆంద్రప్రదేశ్ హక్కులు లభించటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఈ నెలాఖరుకల్లా ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాము అంటూ రోబో విడుదల విషయమై క్లారిటీ ఇచ్చారు..తోట కన్నారావు. ఆయన రోబో తెలుగు వెర్షన్ ఆంద్రప్రదేశ్ హక్కులను పొందారు. ఇక రోబో చిత్రం సెప్టెంబర్ 15కి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తయి సెన్సార్ కోసం ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. అనంతరం సెన్సార్, ప్రింట్స్ వేయటం ముగించుకుని,పబ్లిసిటీ ఫినిష్ చేసుకుని సెప్టెంబర్ 24 న గానీ, సెప్టెంబర్ 30న గానీ చిత్రాన్ని విడుదల చేస్తారు. అయితే చిత్రం ధియోటర్స్ దొరక్క ఆంధ్రాలో ఇబ్బంది ఎదురవుతుందనే విషయాన్ని కూడా కన్నారావు కొట్టిపారేస్తున్నారు. అంతా ఆలోచించే తాము రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటున్నామంటున్నారు. శంకర్ దర్శకత్వంలో రెడీ అయిన ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా చేస్తోంది. సైన్స్ ఫిక్షన్ గా రెడీ అవుతున్న ఈ చిత్రం తెలుగు అవతార్ గా అంతా అభివర్ణిస్తున్నారు.


Click it and Unblock the Notifications











