TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
రజనీ పొలిటికల్ ఎంట్రీ: విష్ చేసిన అమితాబ్, కమల్ ... ట్విట్టర్లో ట్రెండింగ్

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు రాజకీయ పార్టీ స్థాపిస్తానని, తమిళనాడులో అన్ని అసెంబ్లీ స్థానాల నుండి తమ పార్టీ తరుపున అభ్యర్థులను బరిలో నిలుపుతామని ప్రకటించారు. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా స్వాగతిస్తున్నారు. రజనీ రాజకీయ ఆరంగ్రేటపై అమితాబ్, కమల్ హాసన్ తదితరులు స్పందించారు.
|
అమితాబ్ ట్వీట్
నా ప్రియ మిత్రడు, సహచర నటుడు, ఆప్తుడు అయిన రజనీ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించాడు. రాజకీయాల్లో అతను రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అంటూ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు.
|
కమల్ హాసన్
రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని ఆయన సహచర నటుడు కమల్ హాసన్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
|
ఖుష్భూ
ప్రముఖ నటి ఖుష్బూ స్పందిస్తూ.... ప్రజాస్వామ్యం, అభివృద్ధిపై రజనీకి నమ్మకం ఉందనే విషయం మనందరికీ తెలుసు, ఆయన రాజకీయాల్లో రాణించాలని కోరుకుంటున్నాను... అని ట్వీట్ చేశారు.
|
లింగుస్వామి ట్వీట్
తమిళ ప్రజలు రజనీ వెంటే ఉంటారని... రాజకీయాల్లో కూడా ఆయనకు తిరుగులేదని దర్శకుడు లింగుస్వామి అన్నారు.
|
రజనీ బెటర్ లీడర్
తమిళనాడులో ఇప్పుడున్న వారి కంటే రజనీకాంత్ బెటర్ లీడర్. ప్రజల నుండి వస్తున్నాడు. ప్రజల కోసం పని చేస్తాడనే నమ్మకం ఉంది.... అని నటి హుమా ఖురేషి ట్వీట్ చేశారు.
|
సాయేషా
రజనీకాంత్ రాజకీయ తెరంగ్రేటంపై నటి సాయేషా స్పందిస్తూ....ఈ సంవత్సరం నేను విన్న గొప్ప వార్త ఇదే అని, రజనీసార్ తన ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం అద్భుతంగా ఉంది. త్వరలో మనం మార్పును చూడబోతున్నామని ట్వీట్ చేశారు.
|
రవీంద్ర జడేజా
రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై రవీంద్ర జడేజా ట్వీట్.
ట్విట్టర్లో ట్రెడింగ్
రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ విషయం ప్రకటించగానే ఆ విషయం ట్విట్టర్లో ట్రెండింగ్ అయింది.