రజనీ ‘విక్రమసింహా’రిలీజ్ ఆ పండుగకే...

By Srikanya

హైదరాబాద్ : తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీ నటిస్తున్న చిత్రం 'కోచడయాన్'. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ 'విక్రమసింహా' టైటిల్ తో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలను దీపావళి పండుగ రోజున చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయసమాచారం. దీపికా పదుకొనే హీరోయిన్. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చుతున్నాడు.

రాజుల కాలం నాటి కథతో, గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యం ఇస్తూ తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో ట్రైలర్‌ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. 'కోచ్చడయాన్‌'ను వెలుగుల పండుగకు జనం ముందుకు తీసుకెళ్లేందుకు నిర్మాత సిద్ధమైనట్లు సమాచారం. నిర్మాణాంతర పనులు ఒకట్రెండు నెలల్లో పూర్తయ్యే సూచనలు కనిపిస్తుండటంతో దీపావళి కానుకగా విడుదల చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం.

''నా సినీ జీవితంలో ఇదో గొప్ప చిత్రమవుతుంది. మరో మైలురాయిగా నిలుస్తుంది''అన్నారు రజనీకాంత్. ఈ చిత్రం 'కోచ్చడయాన్‌' అనే యోధుడు కథ ని తెలుపుతుంది. ఈ చిత్రంలో రజనీ...ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇది వందశాతం రజనీ ఫార్ములా చిత్రం అని చెప్తున్నారు.

ఈ చిత్రం కథ గురించి ఆయన కుమార్తె సౌందర్య మాటల్లోనే... ఇందులో ఇద్దరు రజనీలు ఉంటారు. ఇందులో సీనియర్‌ రజనీయే 'కోచ్చడయాన్‌'. ఆయనో దళపతి. తమ దేశపు రాజుకు కోచ్చడయాన్‌ మంచి స్నేహితుడు. ఆ మిత్రుడి కోసం ప్రపంచాన్నే జయించి.. ఆ విజయాన్ని రాజుకు సమర్పించాలని ఉత్సాహపడే సైనికుడు. అంతేకాదు.. కోచ్చడయాన్‌ భరతనాట్య కళాకారుడు కూడా. యుద్ధంలో ఆక్రోశంగా, వీరోచితంగా పోరాడే కోచ్చడయాన్‌.. వెనువెంటనే అందమైన అభినయంతో నృత్యం చేస్తారు. అలాంటి పాత్రకు ఎవర్ని హీరోయిన్ గా తీసుకుందామా.. అని ఆలోచించాం. అప్పుడు మా అందరికీ తోచిన పేరు శోభన.

అలాగే...ఇందులో తండ్రి 'కోచ్చడయాన్‌'.. కుమారుడు 'రాణా'. తండ్రిని మించిన తనయుడు. తండ్రితో పోల్చితే వందరెట్లు వేగంగా దూసుకుపోయే వ్యక్తి. రజనీకాంత్‌ అభిమానిగా చెబుతున్నా.. కచ్చితంగా వందశాతం కమర్షియల్‌ హంగులు ఇందులో ఉన్నాయి. ఇదివరకు నాన్న పోషించని పాత్ర ఇది. అభిమానులు ఎదురుచూసే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ఇందులో ఓ సన్నివేశంలో ఠీవీగా, స్త్టెల్‌గా ఓ పంచ్‌ డైలాగు చెప్పి.. ఇంకాస్త స్త్టెల్‌గా నడిచివెళ్తుంటారు.. ఆ సన్నివేశాన్ని చూసి యూనిట్‌ మొత్తం క్లాప్‌ కొట్టింది.

ఇక నాన్నకు రెండు బ్లాక్‌బస్టర్‌ హిట్లను అందించిన కేఎస్‌ రవికుమార్‌ ఈ చిత్రానికి స్క్రిప్టు రాశారు. రెహమాన్‌ సంగీతం సమకూర్చిన ఆరు పాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అన్నివర్గాలను ఆకట్టుకునే బాణీలవి. దీపికా పదుకొనే హీరోయిన్ అనే విషయం అందరికీ తెలుసు. చిత్రంలో రెండో కథానాయికగా శోభన కనిపిస్తారు. ఆమెది కథాపరంగా ఎంతో కీలకపాత్ర అని చెప్పుకొచ్చారమె.

ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర పనులు సాగుతున్నాయి. టిన్‌టిన్‌, అవతార్‌.. తరహాలో ఈ చిత్రంలో మోషన్‌ కాప్చర్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. చిత్ర ద్వితీయార్థానికి రజనీకాంత్‌ డబ్బింగ్‌ చెప్పే పనులు సాగుతున్నాయి. 'సుల్తాన్‌ ది వారియర్‌' ప్రారంభించినప్పుడు ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం రాలేదు. అందువల్లే దాన్ని వదులుకున్నాం. 'కోచ్చడయాన్‌'లో కార్టూన్‌ సినిమాల్లా లాంటి ఫీల్‌ రాదు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X