రజనీ తిరుపతి టూర్ వెనక సీక్రెట్..?
సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా కాలం తర్వాత తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి చేరుకున్న ఆయన దర్శనం అనంతరం, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న కెన్సస్ హోటల్ లో బస చేశారు. ఆయనతో పాటు భార్య, అల్లుడు ధనుష్, కూతురు ఐశ్వర్య, మనవడు ఉన్నారు.
రాణా సినిమా షూటింగ్ ప్రారంభ రోజే అనారోగ్యం పాలైన రజనీ చాలా కాలం పాటు విదేశాల్లో చికిత్స పొందారు. కోలుకుని భారత్ తిరిగి వచ్చాక ఇంటికే పరిమితం అయిన ఆయన...ఇప్పడు ఆనారోగ్యం పూర్తిగా నయం కావడంతో తిరుమలేశుని దర్శనాకి వచ్చారు.
రజనీ తిరుపతి రావడం వెనక రెండు కారణాలు ఉన్నాటయంటున్నారు ఆయన సన్నిహితులు. ఆ మధ్య తిరుపతి వచ్చిన ధనుష్....రజనీ కోలుకుంటే తిరుపతి తీసుకొస్తానని మొక్కుకున్నాడని, మొక్కు తీర్చుకునేందుకు ఆయన కుటుంబంతో కలిసి వచ్చారంటున్నారు. అదే విధంగా త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న రాణా సినిమాకు ఎలాంటి ఆటంకాలు ఏర్పకుండా ఉండేందుకు తిరుమలలో ప్రత్యేక పూజలు చేయాలని నిర్ణయించుకోవడం కూడా మరో కారణమట.


Click it and Unblock the Notifications











