శ్రీదేవి ‘ఇంగ్లిష్-వింగ్లిష్’ చూసిన రజనీకాంత్
చెన్నై: అతిలోక సుందరిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి త్వరలో 'ఇంగ్లీష్ వింగ్లిష్' చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈచిత్రం స్పెషల్ షోను సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ వీక్షించారు. గురువారం చెన్నయ్ లో రజనీతో పాటు పలువురు సినీ ప్రముఖులకు స్పెషల్ షో వేసారు. ఈ షోకి శ్రీదేవితో పాటు, ఆమె భర్త బోనీ కపూర్ కూడా హాజరయ్యారు.
ఈ సినిమా చూసిన అనంతరం రజనీకాంత్ గతంలో శ్రీదేవితో పని చేసిన సంఘటనలను గుర్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి రీ ఎంట్రీ చిత్రం చాలా బాగుందని, ఇది తప్పకుండా విజయవంతం అవుతుందని, ఆమె అభిమానులకు ఈ సినిమా నచ్చుతుందని రజనీకాంత్ అన్నట్లు సమాచారం.
మొత్తానికి శ్రీదేవి రీ ఎంట్ర మూవీ భారీగానే విడుదలవుతోంది. శ్రీదేవి అభిమానులు ఇటు సౌత్ లోనూ అటు నార్త్ లోనూ ఉండటం, ఆమె ఆలిండియా ఫిగర్ కావడంతో హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల చేస్తున్నారు. భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న ఈచిత్రానికి భారీగా కలెక్షన్లు వస్తాయని ఆశిస్తున్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కూడా ఇటీవల 'ఇంగ్లిష్-వింగ్లిష్' చిత్రం చూసి...చాలా ఎమోషన్ అయిన సంగతి తెలిసిందే. అమెరికాలో ఒక భారతీయ గృహిణి ఇంగ్లీష్ మాట్లాడేందుకు ఇబ్బందులు పడుతూ ఎదుర్కొన్న అవమానాలు, ఆ తర్వాత ఆమె ఏం చేసింది అనే ఇతి వృత్తంతో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత హౌస్ వైఫ్ గా సెటిలైన శ్రీదేవి ఇంతకాలం తన ఇద్దరు కూతుర్ల బాగోగులు చూసుకుంటూ గడిపేసింది. అలా అని అందాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పటికీ సన్నటి తీగలా నవనవలాడుతోంది. మరి శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ ఏమేరకు సక్సెస్ అవుతుందో..
ఈ చిత్రంలో అమితాబ్, అజిత్ అతిథి పాత్రల్లో కనిపిస్తున్నారు. ఎక్కువ భాగం న్యూయార్క్ లో షూటింగ్ జరుపుకుంటున్న 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రంలో శ్రీదేవి, ఆదిల్ హుస్సేన్, ప్రియా ఆనంద్, మెహిదీ నెబ్బో నటిస్తున్నారు. సంగీతం: అమిత్ త్రివేది, సౌండ్: రసూల్ పూకుట్టి, ఫోటో గ్రఫీ: లక్ష్మణ్ ఉటేకర్, ఎడిటింగ్: హేమంతి సర్కార్, నిర్మాతలు: రాకేష్ జుంజుంవాలా, ఆర్.దమని, సునీల్ లుల్లా, ఆర్. బాల్కీ, రచన-దర్శకత్వం: గౌరీ షిండే.


Click it and Unblock the Notifications











