400 కోట్లు కూడా సరిపోలేదా శంకర్.. మరో వంద కోట్లు, 2.0 విడుదల ఇక అంతేనా!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న 2.0 చిత్రం ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు విడుదల అవుతుంది, అసలు విడుదల అవుతుందా లేదా అనే సందేహాలు మొదలవుతున్నాయి. దిగ్గజ దర్శకుడు శంకర్ నుంచి ఇంతటి బలహీనమైన ప్లానింగ్ ని ఎవరూ ఊహించలేదు. చిత్రీకరణ, విడుదల విషయంలో పక్కా ప్లాన్ తో వ్యవహరించే శంకర్ ఈ సారి ఫెయిల్ అయ్యాడు. రోబో చిత్రాన్ని మించేలా 2.0 చిత్రాన్ని నిర్మిద్దామని ప్లాన్ చేశాడు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఇండియన్ స్క్రీన్ పై కనివిని ఎరుగని విధంగా గ్రాఫిక్ మాయాజాలం సృస్తిద్దామని భావించిన శంకర్ ప్లాన్ పూర్తిగా బెడిసి బెడిసికొట్టేలా కనిపిస్తోంది. తాజగా ఈ చిత్రం గురించి వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆందోళన పెంచుతున్నాయి.

Recommended Video

2.0 ఆలస్యానికి అసలు కారణం ఇదే
400 కోట్లు కూడా

400 కోట్లు కూడా

నాలుగు వందల కోట్ల బడ్జెట్ అంటే భారతీయ చిత్రాలకు మామూలు విషయం కాదు. కానీ రజని క్రేజ్, శంకర్ సత్తా నమ్మి ప్రొడ్యూసర్స్ 2.0 చిత్రానికి అంత బడ్జెట్ కేటాయించారు. కనీసం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఓ కొలిక్కి రాకముందే 400 కోట్లు మంచినీళ్లలా ఖర్చిపోయినట్లు తెలుస్తోంది.

మరో వంద కావాలి

మరో వంద కావాలి

ఈ చిత్రం విడుదల కావాలంటే మరో వంద కోట్లు ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి నెలకొందని వార్తలు వస్తున్నాయి. పూర్తి చేయాల్సిన సిజి వర్క్( కంప్యూటర్ గ్రాఫిక్స్) భారీ స్థాయిలో అలాగే మిగిలిపోయి ఉందట. శంకర్ ఆలోచనలకు తగ్గట్లుగా గ్రాఫిక్స్ రావాలంటే కనీసం మరో వంద కోట్లు తప్పనిసరి అని అంటున్నారు.

చాలా రోజులుగా ఆగిపోయిన పని

చాలా రోజులుగా ఆగిపోయిన పని

అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటె గత ఏడాది దీపావళికే 2.0 చిత్రం విడుదల కావాల్సి ఉంది. సిజి వర్క్ పెండింగ్ కావడంతో విడుదల వరుసగా వాయిదా పడుతోంది.

విడుదల కావాలి అంటే

విడుదల కావాలి అంటే

2.0 చిత్రం వెండి తెరని తాకాలి అంటే నిర్మాతలు మరో 100 కోట్లు సమకూర్చక తప్పదు. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే 2019 లో 2.0 చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ ఇంతవరకు చిత్రం యూనిట్ దీనిపై నోరు మెదపడం లేదు.

ప్రతినాయకుడిగా అక్షయ్

ప్రతినాయకుడిగా అక్షయ్

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. హాట్ బ్యూటీ అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X