భయంకరంగా అక్షయ్ లుక్.. 2.0లో రోమాలు నిక్కపొడుచుకొనేలా వేషం..
Recommended Video

భారతీయ సినిమా చరిత్రలోనే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న 2.0. చిత్రంపై ఏదో ఒక వార్త ప్రేక్షకులను ఆసక్తిని పెంచుతున్నది. శనివారం రోజున చెన్నైలో జాతీయ మీడియా సాక్షిగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను అట్టహాసంగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అతి తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వ్యూస్ సాధించింది. రజనీ, అక్షయ్ కుమార్, శంకర్ కాంబినేషనల్‌లో వచ్చే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులకు కిక్కెక్కించే విధంగా ఉండబోతుందంటూ ట్రైలర్ చెప్పకనే చెప్పింది. లైకా ప్రొడక్షన్ రూపొందించిన ఈ చిత్రం రూ.600 కోట్లతో తెరకెక్కిన సంగతి తెలిసిందే.

హాలీవుడ్ టెక్నాలజికీ సవాల్
రోబో 2.0 చిత్రానికి సంబంధించిన ట్రైలర్ చూస్తే హాలీవుడ్ సినిమా నిర్మాణానికి, టెక్నాలజీకి సవాల్‌గా నిలిచేలా కనిపించింది. ట్రైలర్‌లోని సన్నివేశాలు రొమాలు నిక్కపొడిచేలా ఉన్నాయి. దాంతో 2.0 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు చూద్దామా అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో నెలకొంది.

రెండింతల కలెక్షన్లను వసూలు
లేటయినా, బడ్జెట్ గురించి ఆలోచించనక్కర్లేదు. ఈ చిత్రం రెండింతల కలెక్షన్లను వసూలు చేస్తుందని రజనీకాంత్ చెప్పడంతో మరింత ఆసక్తిని పెంపొందించింది. ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించిన అక్షయ్ కుమార్‌పై సూపర్‌స్టార్ రజనీ ప్రశంసలు కురిపించారు. కాకి పాత్ర కోసం ఆయన వేసుకొన్న మేకప్, ఆ పాత్ర కోసం అక్షయ్ చూపించిన అంకితభావం మాటల్లో చెప్పలేనిదని పేర్కొన్నారు. రజనీ మాటలకు బలం చేకూర్చే విధంగానే అజయ్ గెటప్ ఉంది.

టెర్రిఫిక్ లుక్‌లో అక్షయ్ కుమార్
2.0 ట్రైలర్ రిలీజ్ తర్వాత ఓ టెర్రిఫిక్ లుక్‌ను అక్షయ్ కుమార్ షేర్ చేశారు. అక్షయ్ లుక్ చూడగానే రోమాలు నిక్కబొడిచే విధంగా ఉంది. ఈ ఫొటోను షేర్ చేసిన అక్షయ్ ఓ ఆసక్తికరమైన కామెంట్ ఉంది. సాధారణంగా అక్షయ్ కుమార్ మేకప్ వేసుకోడు. కానీ 2.0 కోసం భారీగా మేకప్ వేసుకోక తప్పలేదు. లుక్ ఫర్‌ఫెక్ట్‌గా రావడానికి హీరోయిన్ కంటే ఎక్కువ సేపు మేకప్ వేసుకోవాల్సి వచ్చింది అని కామెంట్‌లో పేర్కొన్నారు.

పవర్ ఫుల్ విలన్ పాత్రలో
2.0 చిత్రం ద్వారా అక్షయ్‌కుమార్ తొలిసారి దక్షిణాదిలో అడుగుపెట్టాడు. పవర్ ఫుల్ విలన్ పాత్రలో ఆయన కనిపిస్తారు. ఇంకా ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా, ఆదిల్ హుస్సేన్, సుధాంశు పాండే కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నవంబర్ 29న విడుదల కానున్నది.


Click it and Unblock the Notifications











