రజనీకాంత్-అమీర్ కొత్త ప్రాజెక్టు(డబ్బుకోసం కాదు)
ఒకరేమో ఆలిండియా సూపర్ స్టార్, మరొకరేమో బాలీవుడ్ లో మిస్టర్ ఫరఫెక్ట్ ఇమేజ్ సొంతం చేసుకున్న స్టార్ హీరో...వీరిద్దరు కలిసి ఒక కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారు. వారెవరో కాదు రజనీకాంత్, అమీర్ ఖాన్. కొత్త ప్రాజెక్టు అంటే ఇదేదో డబ్బులు సంపాదించే మాస్టర్ ప్లాన్ అనుకుంటే పొరపాటే. సేవా భావంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దేశంలో పోషకాహార లోపం తో బాధ పడుతున్న వారిని దాని నుంచి బయట పడేసేందుకు కేంద్రం ప్రభుత్వం తరుపున చేపట్టే ఓ కార్యక్రమానికి ఈ ఇద్దరు స్టార్స్ ప్రచార కర్తలుగా వ్యవహరించనున్నారు.
ఇప్పటి వరకు రజనీకాంత్ ఎలాంటి కమర్షియల్ ప్రకటనల్లో కనిపించలేదు. ఈ తాజా ప్రాజెక్టు కమర్షియల్ ప్రకటనను పోలి ఉన్నప్పటికీ....కేంద్ర ప్రభుత్వం తరుపున ఎలాంటి రెమ్యూనరేషన్ ఆశించకుండా రజనీ ఈ కార్యక్రమం చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా.....తొలి సారిగా రజనీకాంత్ ప్రకటనల్లో కనిపించనుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అనారోగ్యం నుంచి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న రజనీ త్వరలోనే 'రాణా" సినిమా షూటింగులో పాల్గొనబోతున్నాడు. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజనీ సరసన దీపిక పడుకొనె నటిస్తుండగా, రజనీ కూతురు సౌందర్య ఈ సినిమా స్వయంగా తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











