Don't Miss!
- News
చంద్రబాబుకు పొంచివున్న ప్రమాదం: ఎలాగో వివరించిన మంత్రి రోజా..!!
- Sports
IND vs NZ: చెలరేగిన స్పిన్నర్లు.. చేతులెత్తేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు! భారత్ టార్గెట్ ఏక్సౌ!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
రజనీకాంత్ ‘రోబో 2’...విలన్‌గా అమీర్ ఖాన్?

తాజాగా 'రోబో' చిత్రానికి సీక్వెల్‌గా 'రోబో 2' చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రోబో ఫస్ట్ పార్టులో విలన్ పాత్రలో డానీ నటించారు. ఆ సినిమాలో డానీ రోబో చేతిలో చనిపోతాడు. కాగా 'రోబో 2'లో విలన్ పాత్ర ఎవరు చేయబోతున్నారు? అనే విషయం ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఇటీవల వచ్చిన ధూమ్ 3 చిత్రంలో విలన్ పాత్ర పోషించిన అమీర్ ఖాన్....'రోబో 2'లో కూడా విలన్ పాత్ర పోషిస్తాడని బాలీవుడ్, కోలీవుడ్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో త్వరలో తేలనుంది.
రోబో 2 చిత్రం ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే ఉంది. ప్రస్తుతం 'ఐ'(తెలుగులో 'మనోహరుడు') చిత్రం షూటింగులో బిజీగా ఉన్న దర్శకుడు శంకర్ ఈ చిత్రం పూర్తయిన తర్వాత 'రోబో 2' చిత్రంపై దృష్టి సారించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.