»   » తలరాత ఉంటేనే పదవులు : రజనీకాంత్

తలరాత ఉంటేనే పదవులు : రజనీకాంత్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  చెన్నై : రాజకీయాలపై సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాజకీయాలు చేయడం అంత సులభమేమీ కాదన్న ఆయన....కేవలం ప్రతిభ ఉన్నంత మాత్రాన రాజకీయ నేతలు కారని, తలరాత అనేది ఒకటుంటుందని, అక్కడ రాసుంటేనే ఏ పదవైనా చేపడటారని చెప్పుకొచ్చారు.

  భవిష్యత్ లో రాజకీయాల్లోకి వస్తారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ రజనీకాంత్ పై విధంగా సమాధానం చెప్పారు. ఆయన సమాధానం చూస్తుంటే...రాజకీయాల్లోకి రావడం, రాక పోవడం తన చేతుల్లో లేదని, విధి రాత..తల రాత ఎలా ఉంటే అలా జరుగుతుందని చెప్పకనే చెప్పారు. అదే సమయంలో తనకు రాజకీయాలపై ఆసక్తి లేదనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. రజనీ ఆధ్యాత్మిక వాది కావడం వల్లనే ఆయన ఇలా మాట్లాడుతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

  సినిమాల్లో రజనీ స్టైల్ అంటే....చుట్టను స్టైల్‌గా గాల్లోకి విసిరి నోటితో అందుకోవడం లాంటివి చేస్తుంటారు. అయితే రజనీ మాత్రం తన స్టైల్ ను నిజజీవితంలో అభిమానులు ఫాలో కావొద్దని కోరుకుంటున్నారు. అలాంటి వాటిని సినిమా హాలు నుంచి బయటకు రాగానే వదిలి పెట్టాలని, అభిమానులు స్మోకింగ్‌కి, మద్యపానానికి దూరంగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను అని తన మనసులోని మాటను బయట పెట్టారు.

  రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే...
  ప్రస్తుతం ఆయన కొచ్చాడయాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రం ద్వారా రజనీ కూతురు సౌందర్య దర్శకురాలిగా పరిచయం అవుతోంది. ప్రముఖ దర్శకుడు, రచయిత కె.ఎస్. రవికుమార్ ఈ చిత్రానికి కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వంలో సౌందర్యకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

  దేశంలోనే తొలిసారిగా హాలీవుడ్ మూవీ అవతార్ తరహాలో మోషన్ కాప్చర్ టెక్నాలజీతో 3డి ఫార్మాట్‌లో ....భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈచిత్రంలో రజనీకాంత్ సరసన దీపిక పడుకొనె నటిస్తోంది. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

  English summary
  Tamil cinema icon Rajinikanth, whose inimitable style of popping a cigarette into his mouth earned him many a fan among youth, has urged them to kick the habit and indicated to them that he has no political ambitions.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more