జాలేస్తుంది: విశ్వరూపం బ్యాన్‌పై రజనీకాంత్

By Bojja Kumar

చెన్నై: విశ్వరూపం చిత్రంపై తమిళనాడు ప్రభుత్వం నిషేదం విధించిన నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. ఈ విషయంలో ఆయన కమల్ హాసన్ కు మద్దతుగా నిలిచారు. ఈ మేరకు ఆయన శుక్రవారం అభిమానులకు బహిరంగ లేఖ రాసారు. కమల్ హాసన్ ప్రజల మనోభావాలు దెబ్బతీనేలా ఏనాడూ సినిమాలే తీయలేదని వ్యాఖ్యానించారు.

విశ్వరూపం సినిమాను కమల్ హాసన్ వంద కోట్లు ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి తెరకెక్కించారని, సినిమా విడుదల అడ్డుకోవడం తగదన్నారు. విశ్వరూపం విడుదలకు అందరూ సహకరించాలని కోరిన ఆయన... అభ్యంతరాలు ఉంటే చర్చలతో పరిష్కరించుకోవాలని, అభ్యంతరకర సన్నివేశాలు తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

కమల్ హాసన్ తమిళ సినిమాను ప్రపంచ స్థాయి తీసుకెళ్లిన గొప్ప నటుడు అని ప్రశంసించిన రజనీ....విశ్వరూపం ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తుంటే జాలేస్తుందని చెప్పుకొచ్చారు. అదే విధంగా ముస్లిం సోదరులకు రజనీకాంత్ మిలాద్-ఉన్-నబి శుభాకాంక్షలు తెలిపారు.

విశ్వరూపం చిత్రంలో ముస్లిం మనోభావాలు దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయంటూ.... కొన్ని ముస్లిం సంఘాలు ఆందోళన చేపట్టడం, తమిళనాడు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో ఈ చిత్రంపై జయలలిత ప్రభుత్వం 15 రోజుల నిషేదం విధించిన సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మద్రాసు హైకోర్టుకెక్కిన కమల్ హాసన్ కు చుక్కెదురైంది. ఈ నెల 28 వరకు విడుదల చేయకుండా స్టే విధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X