బ్రేకింగ్.. రజనీకాంత్ కి తీవ్ర అస్వస్థత ! జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో జాయిన్
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం ఆందోళన కరంగా మారింది. ఇటీవలె అన్నాత్తె షూటింగ్‌లో ఆరుగురు సభ్యులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు జరిపిన పరీక్షల్లో రజనీకాంత్‌కు కరోనా నెగెటివ్ అని వచ్చింది. రెండు రోజుల నుంచి రజనీకాంత్ స్వీయ నిర్బంధంలోనే ఉంటున్నాడు. కానీ అకస్మాత్తుగా రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ మేరకు అపోలో హాస్పిటల్ ఓ ప్రకటనను జారీ చేసింది.
Recommended Video

హైద్రాబాద్‌లో షూటింగ్..
రజనీకాంత్ తన రాజకీయ ప్రకటన గురించి చేసిన తరువాత.. అన్నాత్తె షూటింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డిసెంబర్ 15 నుంచి షూటింగ్ హైద్రాబాద్‌లోనే జరుగుతూ వచ్చింది. అయితే అన్నాత్తె యూనిట్‌కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో దాదాపు ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అందరిలోనూ అందోళనలు రేకెత్తాయి.

రజినీకి నెగెటివ్..
అయితే రజనీకాంత్‌కు మాత్రం కరోనా నెగెటివ్ అనే వచ్చింది. అన్నాత్తె షూటింగ్‌లో కరోనా సృష్టించిన రచ్చతో రజనీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అయితే రజనీకాంత్‌కు కరోనా నెగెటివ్ వచ్చినా కూడా ఆరోగ్యం మాత్రం స్థిమితంగా లేదు. తాజాగా రజనీ ఆరోగ్యం ఆందోళన కరంగా మారింది.

తీవ్ర అస్వస్థత..
రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో వెంటనే అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ఈ మేరకు అపోలో ఓప్రకటనను జారీ చేసింది. రజనీకాంత్ ఈ రోజు ఉదయం హాస్పిటల్‌లొ జాయిన్ అయ్యారు. గత పది రోజుల క్రితం రజనీకాంత్ నటిస్తున్న అన్నాతే షూటింగులో కొందరు సిబ్బంది కరోనావైరస్ పాజిటివ్‌కు గురయ్యారు. ఈ క్రమంలో రజనీకాంత్ పరీక్షలు చేయించుకోగా ఆయనకు నెగిటివ్ అని తేలింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు.

మరేతర సమస్యలు లేవు..
రజినీకాంత్‌కు కోవిడ్ లక్షణాలేవీ లేకపోయినప్పటికీ హై బీపీతో బాధపడుతుండటంతో ఆయనను హస్పిటల్‌లో చేర్పించి చికిత్సను అందిస్తున్నాం. రజినీకాంత్ బీపీ కంట్రోల్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. దాని తరువాత ఆయన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తాం. బీపీలో హెచ్చుతగ్గులు తప్ప ఆయనకు మరేతర సమస్యలు లేవు అని అపోలో హాస్పిటల్ ప్రకటించింది.


Click it and Unblock the Notifications