2.0 ఫస్ట్ డే రికార్డులు మొదలు: రజనీకాంత్-అక్షయ్ కుమార్ కలిస్తే కలెక్షన్ల ప్రళమయే!

రజనీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2.0 చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా రంగంలో ఉన్న రికార్డులన్నీ ఒక్కొక్కటిగా బద్దలు కొడుతూ దూసుకెళుతోంది.

దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్రెడీ హయ్యెస్ట్ బడ్జెట్ ఇండియన్ మూవీగా రికార్డులకెక్కగా.... ప్రపంచ వ్యాప్తంగా 10,500 స్క్రీన్లలో రిలీజ్ అవ్వడం ద్వారా మరో బిగ్గెస్ట్ రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. ఇక తొలి రోజు ఈ మూవీ తొలి రోజు ఎంత వసూలు చేస్తుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

తమిళనాడులో ఎక్స్‌పెక్టేషన్స్

తమిళనాడులో ఎక్స్‌పెక్టేషన్స్

2.0 చిత్రానికి మంచి ఓపెనింగ్స్ తమిళనాడులో వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఈ చిత్రం తొలి రోజు రూ. 35 కోట్ల నుంచి రూ. 40 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని టాక్.

నార్త్ ఇండియాలో ఎంత వసూలు చేయొచ్చు?

నార్త్ ఇండియాలో ఎంత వసూలు చేయొచ్చు?

నార్త్ ఇండియాలోనూ ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రజనీకి అక్కడ క్రేజ్ ఉండటం, అక్షయ్ కుమార్ నటిస్తున్న సినిమా కావడం, ఇండియన్ బిగ్గెస్ట్ విజువల్ వండర్ కావడంతో ఓపెనింగ్స్ రూ. 40 నుంచి 50 కోట్ల వరకు ఉంటాయని అంచనా.

తెలుగు, కన్నడలో భారీ డిమాండ్

తెలుగు, కన్నడలో భారీ డిమాండ్

తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడనాట కూడా 2.0 చిత్రానికి మంచి డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ కనీసం రూ. 20 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్ల వరకు వసూలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఓవర్సీస్‌లో 3 వేల స్క్రీన్లు

ఓవర్సీస్‌లో 3 వేల స్క్రీన్లు

ఇండియాలో ఈ చిత్రం 7.500 స్క్రీన్లలో విడుదలవుతుండగా ఓవర్సీస్‌లో 3 వేల థియేటర్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్ వసూళ్లు కనీసం రూ. 50 కోట్లు ఉంటాయని అంచనా.

ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఉండొచ్చు?

ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఉండొచ్చు?

ఇప్పటి వరకు రూ. 120 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్లతో బాహుబలి 2 మొదటి స్థానంలో ఉంది. 2.0 ఈ రికార్డును అధిగమించాలంటే అంతకు మించి వసూలు చేయాల్సి ఉంది. అయితే సినిమాపై ఉన్న క్రేజ్, భారీ రిలీజ్ నేపథ్యంలో అది సాధ్యమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకుల.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X