రజనీ, అక్షయ్, శంకర్‌కు అలా.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు.. ఏం జరిగిందంటే..
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన 2.0 చిత్ర ప్రమోషన్ జోరందుకున్నది. దేశవ్యాప్తంగా అట్టహాసంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, దుబాయ్‌లో ఇప్పటి వరకు నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహించాలని తెలుగులో రిలీజ్ చేస్తున్న నిర్మాత ఎన్వీ ప్రసాద్ కోరిక మేరకు హైదరాబాద్‌లో ప్రమోషన్ కోసం రావాలనుకొన్నారు. రజనీకాంత్, అక్షయ్ కుమార్, డైరెక్టర్ శంకర్ హైదరాబాద్‌కు బయలుదేరారు. కానీ కొన్ని కారణాల వల్ల హైదరాబాద్‌కు రావడానికి వీలు కాలేదు. అసలేం జరిగిందంటే..

ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు
చెన్నై నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన ఫ్లయిట్ సాంకేతిక కారణాల వల్ల అందుబాటులో లేకపోవడం వల్ల ఈ ముగ్గురు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకొన్నారు. హైదరాబాద్‌లో దిగిన తర్వాత ప్రత్యేక విమానం ముందు నిలబడి ఫోజిచ్చారు. నిర్మాత ప్రసాద్‌కు ఇచ్చిన మాట మేరకు వారు ఈ విధంగా రావడంపై అభిమానులు, మీడియా సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Recommended Video


2 గంటలపాటు లేటుగా
వాస్తవానికి సోమవారం 4.30 గంటలకు మీడియా సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. కానీ రెండు ఆలస్యంతో రజనీ, అక్షయ్, శంకర్ వేదిక వద్దకు చేరుకొన్నారు. ఆ తర్వాత మీడియాను ఉత్తేజ పరుస్తూ పలు ప్రశ్నలకు రజనీకాంత్ సమాధానం ఇచ్చారు.

2.0 విజయంపై రజనీ
హైదరాబాద్‌లో రజనీకాంత్ మాట్లాడుతూ 2.0 విజయంపై ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2.0 తర్వాత తాను మరో కొత్త అవతారంలో కనిపిస్తాను. అదే పెట సినిమాలో మళ్లీ కొత్తగా చూడబోతున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఎనర్జీతో పనిచేస్తున్నాను అని రజనీ సమాధానం ఇచ్చారు. రాజకీయాలపై మాట్లాడానికి ఆయన నిరాకరించారు.

నేటివ్ 3డీ టెక్నాలజీలో
రోబో 2.0 సినిమా నవంబర్ 29న రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ చిత్రంలో రజనీకాంత్, అక్షయ్ కుమార్‌తోపాటు అమీ జాక్సన్, సుధాంశు పాండే ఆదిల్ హుస్సేన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తిగా నేటివ్ 3డీ టెక్నాలజీలో రూపొందించారు.


Click it and Unblock the Notifications











