చంద్రబాబు, పవన్ ప్రమాణ స్వీకారానికి రజనీకాంత్.. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌కు ఆహ్వానం.. ఎవరెవరు వస్తున్నారంటే?
ఏపీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువు దీరేందుకు సర్వం సిద్దమవుతున్నది. విజయవాడకు సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరువగా ఏర్పాటు చేసిన భారీ సభాస్థలి వద్ద జూన్ 12వ తేదీన ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేయడానికి భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలో అతిథుల వివరాల్లోకి వెళితే..
ఏపీ సీఎంగా చంద్రబాబు, కీలక పదవితో కొనసాగనున్న పవన్ కల్యాణ్ నేతృత్వంలో మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు సామాన్యుల నుంచి అన్ని వర్గాల ప్రముఖులకు ఆహ్వాన లేఖలు అందాయి. సినీ, రాజకీయ, వ్యాపార, సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులను భారీగా ఆహ్వనించారు.

ఏపీ ప్రభుత్వం ఆహ్వానం పంపిన వారిలో సూపర్ స్టార్ రజనీకాంత్, చిరంజీవి, మోహన్ బాబు, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఉన్నారు. అయితే ఇప్పటికే చిరంజీవి తన కుటుంబ సమేతంగా బేగంపేట నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకొన్నారు. మిగితా వారందరూ ఉదయంలోగా విజయవాడకు చేరుకొంటారని సమాచారం.
ఇక రాజకీయ నేతల విషయానికి వస్తే.. ఈ వేడుకలో యూపీ ముఖ్యమంత్రి యోగీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు అవుతారు. ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులు హజరవుతారా? లేదా అనే విషయంపై క్లారిటీ లేదని పేర్కొంటున్నారు.

అయితే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ హాజరవుతారా? లేదా అనేది వేచి చూడాల్సిందే. ఎందుకంటే చాలా ఏళ్లుగా టీడీపీకి, చంద్రబాబుకు ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. ఇక తాజా ఎన్నికల్లో అల్లు అర్జున్..ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతు తెలియజేయడం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో ఈ ఇద్దరి విషయంపై ఇంకా తేలాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











