మోడీ ప్రమాణం: సినీ స్టార్స్ ఎవరెవరికి ఆహ్వానం?
హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుండి దాదాపు మూడు వేల మంది ప్రత్యేక అతిథులు విచ్చేస్తున్నారు. సినిమా రంగం నుండి కూడా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. మే 26వ తేదీన మోడీ ప్రమాణ స్వీకారోత్సవం జరుగనుంది.
అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, పవన్ కళ్యాణ్, అతా మంగేష్కర్ లాంటి ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్‌కు మోడీతో మంచి అనుబంధం ఉంది. గుజరాత్ టూరిజం అంబాసిడర్‌గా కూడా అమితాబ్ బచ్చన్ కొనసాగుతున్నారు.

అదే విధంగా సల్మాన్ ఖాన్‌తో, ఆయన తండ్రి సలీమ్ ఖాన్ మోడీకి సన్నిహితులు. ఎన్నికల ముందు సల్మాన్ ఖాన్ అప్పట్లో గుజరాత్‌లో జరిగిన పలు వేడుకల్లో మోడీతో కలిసి పాల్గొనడం చర్చనీయాంశం అయింది. ఇక నరేంద్ర మోడీ, రజనీకాంత్ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అదే విధంగా తెలుగు నుండి పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందినట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలో మోడీ తరుపున ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్....ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలోని ఏన్డీయే కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ అధికారంలో తేవడంలో, కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించడంలో ప్రధాన భూమిక పోషించారు.


Click it and Unblock the Notifications











