‘మగధీర’ చూసిన సూపర్ స్టార్ రజని
సినిమా ఇండస్ట్రీలో లేటస్ట్ గా వచ్చి, ఆంధ్రరాష్ట్రమంతా భారీ విజయంతో ఒక ఊపు ఊపేస్తున్న రామ్ చరణ్ తేజ నటించిన 'మగధీర" సినిమాను చెన్నైలో సూపర్ స్టార్ హీరో రజనీకాంత్, దర్శకుడు శంకర్ తో కలినసి వీక్షించారు. దర్శకుడు శంకర్ మాట్లాడుతూ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో సాంకేతికంగా ఉన్నత స్థయిలో తీర్చిదిద్దడంలో రాజమౌళి కృషి తెరపై కనిపిస్తోందని చేప్పారు. రజనీకాంత్ మాట్లాడుతూ రామ్ చరణ్ మొదటి చిత్రం 'చిరుత" విడుదలైనపుడు ఆ సినిమా కూడా చూశాను. అప్పుడే అనుకొన్నాను భవిష్యత్ లో చరణ్ పెద్ద స్టార్ అవుతారని, ఆ మాటలు 'మగధీర" తో నిజం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. 'మగధీర" సినిమాలో రామ్ చరణ్ నటన చాలా బాగుంది, ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయంతో చాలా చక్కగా నటించాడు అని రజనీకాంత్ తెలియజేశారు.
magadheera rajinikanth shankar ram chran teja biggest star chiruta chennai expensve మగధీర రజనీకాంత్ శంకర్ రామ్ చరణ్ చిరుత రాజమౌళి


Click it and Unblock the Notifications