నయనతార ‘సూపర్’కి కితాబులిచ్చిన సూపర్ స్టార్...
ఉపేంద్ర, నయనతార జంటగా నటించిన కన్నడ చిత్రం'సూపర్" ఇటీవల విడుదలయ్యింది. త్వరలో తెలుగులో కూడా విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే ఇటీవల రజనీకాంత్ బెంగళూరు వెళ్లినప్పుడు ఈ చిత్ర నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ దగ్గర 'సూపర్" సినిమాని చూడాలని ఉందని అన్నారట. సో దాంతో రజనీ కోసం ప్రత్యేకంగా ఓ షో ఏర్సాటు చేశారు. ఈ చిత్రానికి ఉపేంద్ర దర్శకత్వం వహించాడు.
సినిమా చాలా బాగుందని, ఉపేంద్ర గ్రేట్ యాక్టరే కాదు గ్రేట్ డైరెక్టర్ కూడా అని, మనకున్న గొప్ప దర్శకుల్లో ఉపేంద్ర ఒకరు అని రజనీకాంత్ కితాబులు ఇచ్చేశారట. దాంతో ఈ చిత్రం పట్ల తెలుగు ట్రేడ్ సర్కిల్స్ లో అంచనాలు పెరిగాయి. కన్నడంలో శివరాజ్ కుమార్ నటిస్తున్న జోగయ్య సినిమాలో తను నటించుట లేదని అది రూమరని అన్నారు, కాని నాకు మంచి స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా కన్నడంలో సినిమా తీస్తామన్నారు.


Click it and Unblock the Notifications











