హైదరాబాద్‌లో సందడి చేయబోతున్న రజనీకాంత్
హైదరాబాద్: సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా రోజుల తర్వాత హైదరాబాద్ రాబోతున్నారు. రజనీకాంత్ నటించిన 'కొచ్చాడయాన్' చిత్రం మే నెలలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లో భాగంగా ఏప్రిల్ 19న కర్టెన్ రైజర్ కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్‌తో పాటు, చిత్ర దర్శకురాలు సౌందర్య కూడా హాజరవుతున్నట్లు సమాచారం.
సూపర్ స్టార్ రజనీకాంత్ కేవలం తమిళనాడులోనే పాపులర్ కాదు...ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజనీకాంత్ ఇదివరకు నటించని 'రోబో' చిత్రం తెలుగులో విడుదలై సూపర్ హిట్ అవడంతో పాటు భారీ వసూళ్లను సాధించింది. తాజాగా రజనీకాంత్ నటించిన తమిళ చిత్రం 'కొచ్చాడయాన్' తెలుగులో 'విక్రమ సింహ' పేరుతో విడుదలవుతోంది.

'విక్రమ సింహ' చిత్రం రాజుల నాటి కథాంశంతో తెరకెక్కిన సినిమా. రజనీ కూతురు ఐశ్వర్య ఆర్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కెఎస్ రవి కుమార్ ఈచిత్రానికి స్క్రిప్టు అందించారు. పాండ్య సామ్రాజ్య రాజు కొచ్చాడయాన్ రణధీరన్ స్టోరీ ఇన్స్‌స్పిరేషన్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
రజనీకాంత్-దీపిక పదుకోన్ జంటగా నటించిన ఈ చిత్రానికి రజనీ కూతురు సౌందర్య దర్శకత్వం వహించారు. 3డి మోషన్ క్యాప్చర్ యానిమేషన్ పార్మాట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దాదాపు రూ. 125 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసారు. దీపిక పదుకోన్, జాకీష్రాఫ్, శరత్ కుమార్, శోభన, ఆది, నాజర్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











