మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా రజనీకాంత్
నరేంద్రమోదీ 2019 ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించి రెండోసారి భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు దేశ రాజధాని న్యూ ఢిల్లీలో గురువారం సాయంత్రం వైభవంగా ప్రమాణస్వీకారోత్సం జరుగుబోతోంది. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన 8వేల మంది అతిథులు హాజరయ్యారు. వీరిలో సినీ రంగానికి చెందిన స్టార్స్ కూడా ఉన్నారు.
ఈ వేడుకలో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సూపర్ స్టార్ సతీసమేతంగా హాజరయ్యారు. మోదీకి అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు పొందిన రజనీకి ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది.

గతంలో నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం నిమిత్తం తమిళనాడు వచ్చినపుడు స్వయంగా వెళ్లి రజనీకాంత్‌ను కలిశారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. రజనీకాంత్ బీజేపీలో చేరతారని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా రాజకీయ పార్టీ స్థాపించారు సూపర్ స్టార్.
సినిమా రంగం నుంచి ఇంరా అనిల్ కపూర్, వివేక్ ఒబెరాయ్, అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్, షారుక్ ఖాన్, సంజయ్ లీలా భన్సాలీ, కరన్ జోహార్, ఆనంద్ ఎల్ రాయ్, మధుర్ బండార్కర్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ తదితరులు ఆహ్వానం అందింది. ప్రముఖులు అతిథుల రాకతో ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణం సందడిగా మారింది.


Click it and Unblock the Notifications











