దీనస్థితిలో సీనియర్ నిర్మాత.. రూ.కోటితో ఆదుకొన్న రజనీకాంత్.. ఏం చేశారంటే..

సూపర్ స్టార్ రజనీకాంత్‌ను మానవత్వానికి ప్రతీరూపంగా కొలుస్తారు ఆయన అభిమానులు. ఎందుకంటే ఆయన చేసే పనులు, కార్యక్రమాలు అందరికి స్పూర్తినింపేలా ఉంటాయి. తాజాగా అందుకు ఉదాహరణగా రజనీ చేసిన పని నిలిచింది. అందరిచే వావ్ అనిపించేలా చప్పట్లు కొట్టించారు రజనీకాంత్. ప్రస్తుతం తమిళ సినీ వర్గాల రజనీకాంత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

నిర్మాత దీన పరిస్థితి ఇదే

నిర్మాత దీన పరిస్థితి ఇదే

ఆగస్టు 14 తేదీన సీనియర్ నిర్మాత, రచయిత కలైగ్ననమ్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ భారతీరాజా, రజనీకాంత్, శివకుమార్, ఇతర సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున్న హాజరయ్యారు. ఈ సందర్భంగా నటుడు, నిర్మాత శివకుమార్ మాట్లాడుతూ.. సీనియర్ నిర్మాత కలైగ్ననమ్ దీన పరిస్థితిని సభా ద‌ృష్టికి తీసుకొచ్చారు. ఇంకా అద్దె ఇంటిలోనే ఉంటున్నారు. ఆయన తమిళనాడు ప్రభుత్వం ఓ ఇంటిని కొనివ్వాలని సూచించారు.

రజనీకాంత్ చేయూత

రజనీకాంత్ చేయూత

ఆ తర్వాత మాట్లాడేందుకు వేదికపైకి వచ్చిన రజనీకాంత్ మాట్లాడుతూ.. తాను కలైగ్నమ్‌కు ఇంటిని కొనిస్తాను. ఆ అవకాశం తమిళనాడు ప్రభుత్వానికి ఇవ్వను. త్వరలోనే కలైగ్ననమ్ సొంత ఇంటిలోకి వెళ్తారు. పది రోజుల్లో నేను డబ్బు ఇస్తాను అని అన్నారు. రజనీకాంత్ నటించిన భైరవి అనే సినిమాను నిర్మాత కలైగ్ననమ్‌ రూపొందించారు. భైరవి చిత్రం తనకు ఎంతో ఇష్టమైనదని, తన కెరీర్‌లో గుర్తుపెట్టుకొనే చిత్రాల్లో ఒకటి అని రజనీకాంత్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

ఇంటిని కొనుగోలు చేసినట్టు

ఇంటిని కొనుగోలు చేసినట్టు

అయితే రజనీకాంత్ తన హామీని నిలబెట్టుకొన్నట్టు మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం జరుగుతున్నది. రజనీకాంత్ కోటి రూపాయలతో ఇంటిని కొనుగోలు చేసి అప్పగించారని, ఆ ఇంటిని దర్శకుడు భారతీరాజా ఫైనలైజ్ చేశారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే అధికారికంగా ఈ వార్తను ఇంకా ధృవీకరించలేదు.

 దర్బార్‌లో రజనీకాంత్

దర్బార్‌లో రజనీకాంత్

ఇక రజనీకాంత్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. 2019 తమిళ సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో నయనతార, యోగిబాబు తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X