»   » రజనీ సింహంలా గర్జించారు, పుకార్లు నమ్మొద్దు: నిర్మాత ప్రకటన

రజనీ సింహంలా గర్జించారు, పుకార్లు నమ్మొద్దు: నిర్మాత ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ గాదాపు నెల రోజులుగా అమెరికాలోనే ఉండటంతో ఆయన ఆరోగ్యం మీద రకరకాల రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రజనీ ఆరోగ్యం బాలేదని, ఆయన కొడ్నీ మార్పిడి జరిగిందని...ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఇటీవలే ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ రజినీకాంత్‌ సోదరుడు సత్యనారాయణ.... సూపర్‌స్టార్‌ ఆరోగ్యం బావుందని, కేవలం వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారని మీడియాకు వెల్లడించారు. తాజాగా రజనీతో రోబో 2.0 మూవీ నిర్మిస్తున్న నిర్మాత కూడా స్పందించారు.


Rajinikanth Called Producer And Roared Like lion

ఉదయం సూపర్‌స్టార్‌ తనకు కాల్‌ చేసి, సింహంలా గర్జించారు అంటూ లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం ట్వీట్‌ చేశారు. ఇప్పటికైనా ఈ రూమర్స్ కు ఫుల్‌స్టాప్‌ పెడతారని ఆశిస్తున్నాన్నాను అని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. శంకర్‌ దర్శకత్వంలో రజినీకాంత్‌ హీరోగా నటిస్తున్న '2.0' చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.


కబాలి సినిమా విషయానికొస్తే...
ర‌జ‌నీకాంత్‌, రాధికా ఆప్టే, ధన్సిక‌, కిశోర్‌, జాన్ విజ‌య్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకు కెమెరా: ముర‌ళీ, సంగీతం: స‌ంతోష్ నారాయ‌ణ్‌, ఆర్ట్: రామ‌లింగం, ఫైట్స్: అన్బ‌రివు, మాటలు: సాహితి, పాట‌లు: రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్, వనమాలి. మేక‌ప్‌: భాను, ఎఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: దేవి-శ్రీదేవి స‌తీష్‌, సమర్పణ: కలైపులి థాను, నిర్మాతలు: కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్, దర్శకత్వం: పా రంజిత్..

English summary
It's been two weeks since superstar Rajinikanth left to USA and some fans started worrying about health of superstar. However, Robo 2.0's producer Raju Mahalingam of Lyca Productions laughed off Rajini's ill health rumours. In a tweet Raju said that Rajini has called him today morning, "Our SUPERSTAR called me this morning and ROARED like a LION !!! Hope all RUMOURS are put to REST !!! MAGILCHI!!!".He wrote.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu